Sunday, January 19, 2025
HomeTrending Newsటీఏస్ పీఎస్సీ వ్యవహారంపై గవర్నర్ సీరియస్

టీఏస్ పీఎస్సీ వ్యవహారంపై గవర్నర్ సీరియస్

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీక్ ఆరోపణలు రావడం పై సీరియస్ గా స్పందించిన గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్. టీఏస్ పీఎస్సీ సెక్రెటరీ కి గవర్నర్ ఆదేశాల మేరకు లేఖ రాసిన సెక్రెటరీ టు గవర్నర్. ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంపై, జరిపిన దర్యాప్తు పై, వెల్లడైన నిజాల పై సమగ్రమైన నివేదిక రెండు రోజుల్లో సమర్పించాలని టీఎస్పీఎస్సీ ని గవర్నర్ ఆదేశించారు. లక్షలాది మంది ఉద్యోగార్థుల జీవితాలకు సంబంధించిన అంశం అయినందున, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా తీసుకుంటున్న చర్యలపై నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, ఉద్యోగార్థులకు టిఎస్పిఎస్సి పై నమ్మకం కలిగించే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని డాక్టర్ తమిళిసై సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్