Sunday, January 19, 2025
Homeసినిమాడైరెక్ట‌ర్ కి విజ‌య్ ఎస్ చెప్పాడా..?

డైరెక్ట‌ర్ కి విజ‌య్ ఎస్ చెప్పాడా..?

విజ‌య్ దేవ‌ర‌కొండ ‘లైగ‌ర్’ మూవీతో ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. పూరి డైరెక్ష‌న్ లో రూపొందిన ‘లైగ‌ర్’ మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో విజ‌య్ నెక్ట్స్ మూవీ ఏంటి అనేది ఆస‌క్తిగా మారింది. పూరి డైరెక్ష‌న్ లోనే స్టార్ట్ చేసిన జ‌న‌గ‌ణ‌మ‌న చిత్రాన్ని ప్ర‌స్తుతానికి ప‌క్క‌న‌పెట్టేశారు. పూరి నెక్ట్స్ మూవీ కోసం స్టోరీ రాసుకుంటున్నాడు. అలాగే విజ‌య్ నెక్ట్స్ మూవీస్ కోసం స్టోరీలు వింటున్నాడు.

అయితే… విజ‌య్ ఎవ‌రితో సినిమా చేయ‌నున్నాడు..?  ఏ త‌ర‌హా స్టోరీ చేయ‌నున్నాడు.?  అని అభిమానులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. చ‌ర‌ణ్ నో చెప్పిన డైరెక్ట‌ర్ కి విజ‌య్ దేవ‌ర‌కొండ ఎస్ చెప్పాడ‌ట‌. డైరెక్ట‌ర్ గౌత‌మ్ తిన్న‌నూరి అని తెలిసింది. ‘జెర్సీ’ త‌ర్వాత గౌత‌మ్ చ‌ర‌ణ్ కు ఓ స్టోరీ చెప్పాడు. ఈ క‌థ విని చ‌ర‌ణ్ ఓకే చెప్పాడు. ప్ర‌ముఖ నిర్మాత ఎన్.వి. ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మించాలి అనుకున్నారు.

అఫిషియ‌ల్ గా కూడా అనౌన్స్ చేశారు. అయితే.. జెర్సీ మూవీని గౌత‌మ్ హిందీలో రీమేక్ చేశారు. అక్క‌డ జెర్సీ మూవీ ఫ్లాప్ అయ్యింది. దీంతో చ‌ర‌ణ్ ఆలోచ‌న‌లోప‌డ్డాడు. చిరంజీవి క‌థ విని సున్నితంగా తిర‌స్క‌రించారు. ఇప్పుడు గౌత‌మ్ విజ‌య్ కి క‌థ చెబితే ఓకే చెప్పాడ‌ట‌. ఇంత‌కీ ఏ త‌ర‌హా స్టోరీ అంటే.. ఫీల్ గుడ్ ఎంట‌ర్ టైన‌ర్ అని తెలిసింది.  గౌత‌మ్ తిన్న‌నూరి విజ‌య్ ని ఎలా చూపిస్తాడో..?  బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎంత వ‌ర‌కు మెప్పిస్తాడో చూడాలి.

Also Read : చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్ కాంబో భారీ మ‌ల్టీస్టార‌ర్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్