Sunday, January 19, 2025
HomeTrending NewsGraduate MLCs: నూతన ఎమ్మెల్సీలకు ఘనస్వాగతం

Graduate MLCs: నూతన ఎమ్మెల్సీలకు ఘనస్వాగతం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం తరపున పోటీచేసి విజయం సాధించిన వేపాడ చిరంజీవిరావు (ఉత్తరాంధ్ర), కంచర్ల శ్రీకాంత్ (తూర్పు రాయలసీమ), భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి (పశ్చిమ రాయలసీమ) లకు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘన స్వాగతం లభించింది. పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరై.. నినాదాలు చేస్తూ, బాణాసంచా కాలుస్తూ వారిని పార్టీ కార్యాలయంలోకి తోడ్కొని వెళ్ళారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కిజరాపు అచ్చెన్నాయుడు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు వారిని హత్తుకొని అభినందించారు. అనంతరం పార్టీ అధినేత చంద్రబాబు ఈ  ముగ్గురినీ సత్కరించారు.

Also Read : AP Assembly : ఎమ్మెల్సీ ఫలితాలతోనే దాడి: చంద్రబాబు

RELATED ARTICLES

Most Popular

న్యూస్