తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో 80 వేల ఉద్యోగాల భర్తీ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. నియామకాల ప్రక్రియను మరింత ముమ్మరం చేస్తోంది ప్రభుత్వ యంత్రాంగం. ఈ క్రమంలోనే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) మరో కీలక ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణలో గ్రూప్-2 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇది శుభవార్తే. తాజాగా, 783 పోస్టుల భర్తీకి గ్రూప్ -2 నోటిఫికేషన్‌ను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. జనవరి 18 నుంచి అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. మరిన్ని వివరాల కోసం www.tspsc.gov.in సంప్రదించవచ్చు. టీఎస్‌పీఎస్సీ రెండు కొత్త నోటిఫికేషన్లు: 276 పోస్టులు విద్య, వ్యవసాయ శాఖలో 276 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఇంటర్ విద్యాశాఖలో 91, సాంకేతిక విద్యాశాఖలో 37 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, వ్యవసాయ శాఖలో 148 వ్యవసాయాధికారుల పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్లు వెలువడ్డాయి.
ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు పోటీ పడే అభ్యర్థుల వయస్సు 01-07-2022 నాటికి 18-44 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తులను జనవరి 6, 2023 నుంచి జనవరి 27 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు. అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులకు ఆన్‌లైన్‌లో జనవరి 10 నుంచి జనవరి 30, 2023, సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.