Protests Rajapaksa : శ్రీలంక ప్రధానమంత్రి మహింద రాజపక్సను గద్దె దించేందుకు రంగం సిద్దమవుతోంది. బుధవారం నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో మహింద రాజపక్సపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు ప్రతిపక్షాలు సిద్దం అయ్యాయి. పార్లమెంటులో విపక్ష నేత, సమాగి జన బలవేగాయ పార్టీ అధినేత సజిత్ ప్రేమదాస అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నట్టు స్పష్టం చేశారు. ప్రధాని మహింద రాజపక్సపై అవిశ్వాస తీర్మానం, దేశాధ్యక్షడు రాజపక్సను పదవీచ్యుతుడిని చేయాలని కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు హోరెత్తుతున్నాయి.
శ్రీలంక ఫ్రీడమ్ పార్టీ అధికార పార్టీకి మద్దతు ఉపసంహరించుకోవటంతో మహింద రాజపక్స కు పదవీ గండం పట్టుకుంది. ప్రజా ఆందోళనలు వెల్లువెత్తటంతో దేశాధ్యక్షుడు రాజపక్స కూడా మహింద ను గద్దె దింపేందుకు సిద్దం అయ్యారు. బుధవారం జరిగే పార్లమెంటు సమావేశాల్లో డిప్యూటీ స్పీకర్ ను ఎన్నుకోనున్నారు. ఈ సందర్భంగా అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు రాజపక్స కుటుంబ సభ్యులు అధికార పదవులు వదిలిపెట్టాలని డిమాండ్ చేస్తు గత అయిదు రోజులుగా నిర్వహిస్తున్న సమాగి బాల మార్చ్ పేరుతో చేపట్టిన ఉద్యమం తీవ్రరూపం దాలుస్తోంది. కొలంబోలో దేశాధ్యక్షుడి భవనాన్ని ముట్టడించేందుకు ఆందోళనకారులు ప్రయత్నాలు చేస్తున్నారు.
రాజపక్స కుటుంబసభ్యులు అధికారం అడ్డం పెట్టుకొని దారుణమైన మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడినట్లు అంతర్జాతీయంగా ఎన్నో విమర్శలు చెలరేగాయి. వాటిపై దర్యాప్తు జరిపించాలని ఎన్ని ఒత్తిడులు వస్తున్నా శ్రీలంక ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మొత్తం ప్రపంచాన్ని కలవరానికి గురిచేసిన గత ఏప్రిల్ లో కొలొంబోలో చోటుచేసుకున్న ఈస్టర్ బాంబు ప్రేలుడులలో 259 మంది మృతి చెందినా ప్రభుత్వం పట్టించుకోలేదు.
శ్రీలంక తూర్పున వన్నీ ప్రాంతంలో పదే పదే ఆసుపత్రులపై బాంబుల దాడులు జరిగాయి. `కిల్లింగ్ ఫీల్డ్స్ అఫ్ శ్రీలంక’ పేరుతో ఛానల్ 4 విడుదల చేసిన డాక్యుమెంటరీ చిత్రం శ్రీలంక సైన్యం సాగించిన దారుణమైన మానవహక్కుల ఉల్లంఘనలను సవివరంగా వివరించింది. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల విభాగాలతో పాటు శ్రీలంక దర్యాప్తు సంస్థలు సహితం శ్రీలంకలో తమిళులు, ఇతర అసమ్మతి వాదులపై సైన్యం జరిపిన దారుణమైన అత్యాచారాలకు, చట్టాతీత హత్యలకు గొటబయని బాధ్యుడిగా స్పష్టం చేశాయి. మహింద రాజపక్స ఎల్ టి టి ఈ దళాలను హతమార్చడంలో, పెద్ద ఎత్తున శ్రీలంక తమిళుల ఊచకోత సాగించడంలో క్రియాశీల పాత్ర వహించారు.
Also Read : లంకలో నిరసనల హోరు.. రాజపక్స రాజీనామాకు డిమాండ్