ఆర్ఆర్ఆర్.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్రం. దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో ‘ఆర్ఆర్ఆర్‘ చిత్రాన్ని తెరకెక్కించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
అయితే.. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బరిలో నిలుస్తుందని.. ఎన్టీఆర్ ఉత్తమ నటుడు కేటగిరిలో నిలుస్తాడని విదేశాల్లో ఉన్న మ్యాగజైన్స్ వార్తలు రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ సంబరపడ్డారు. దీంతో ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ అంటూ ఇండియాలో ప్రచారం ఊపందుకుంది. ఇటీవల ఎన్టీఆర్ ను అమిత్ షా కలవడంతో ఇండియా తరుపున ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బరిలో నిలవడం ఖాయం అనుకున్నారు.
ఇప్పుడు ఇండియా తరుపున గుజరాతి ఫిల్మ్ ‘ఛల్లో షా’ మూవీ ఆస్కార్ నామినేషన్ ఎంట్రీకి అధికారికంగా వచ్చింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలోకి ఈ మూవీ చోటు దక్కించుకుంది. ఈ మేరకు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఆస్కార్ కు గుజరాతీ చిత్రాన్ని పంపడం ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ కి షాక్ తగిలినట్టు అయ్యింది.
Also Read: ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్, శ్యామ్ సింగ రాయ్.?