Thursday, May 8, 2025
HomeTrending Newsఏబీవీ ఆఫీసర్ గా అన్ ఫిట్: గుడివాడ

ఏబీవీ ఆఫీసర్ గా అన్ ఫిట్: గుడివాడ

He is unfit: చంద్రబాబు హయాంలో పెగాసస్ స్పై వేర్ వినియోగించడంలో ప్రధాన సూత్రధారి నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావు అని ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ స్పష్టం చేశారు. తమపై పరువునష్టం దావా వేస్తామని అయన చెబుతున్నారని, కానీ ఐదు కోట్ల ఆంధ్రులు ఆయనపై దావా వేస్తారని చెప్పారు.  నిన్న ఈ అంశంపై ఏబీ మాట్లాడిన అంశాలపై అమర్ నాథ్ స్పందించారు.

ఏబీవీ పోలీసు అధికారిగా అన్ ఫిట్  అని, హోం గార్డుగా కూడా అయన పనికిరాడని దుయ్యబట్టారు.  పెగాసస్ స్పై వేర్ చంద్రబాబు కొనుగోలు చేసినట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారని,  శాసనసభలో ఈ అంశం పై చంద్రబాబు, టీడీపీ నేతలు మాట్లాడి ఉంటే బాగుండేదని కానీ వారు ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు.  పెగాసస్ స్పై వేర్ ను వాళ్ళే కొనుగోలు చేస్తారని, మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రయతిస్తారని, దీనిపై  లోకేష్ సవాళ్ళు చూస్తే హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.

“AB వెంకటేశ్వర రావు IPS కాదు, ఏబీవీ అంటే…  ఇజ్రాయల్ పెగాసస్  సాఫ్ట్ వేర్ అన్నట్టు ఉంది. ఆయన ఐపీఎస్ కి కాదు,  కనీసం హోమ్ గార్డ్ గా కూడా పని చేయడానికి అర్హుడు కాదు. చంద్రబాబు ఒక పొలిటికల్ పర్వర్టెడ్. ఆయనకు విలువలు లేవు, విశ్వసనీయత లేదు. అనైతిక, అరాచక, దుర్మార్గపు రాజకీయాలను చేసిన వ్యక్తి.  ఇటువంటి చంద్రబాబు రాజకీయాల్లో ఉండదగిన వ్యక్తి కాదు’ అని గుడివాడ దుయ్యబట్టారు.

Also Read :పెగాసస్ పై హౌస్ కమిటి

RELATED ARTICLES

Most Popular

న్యూస్