Wednesday, June 26, 2024
Homeస్పోర్ట్స్IPL: ఢిల్లీ పై గుజరాత్ విజయం

IPL: ఢిల్లీ పై గుజరాత్ విజయం

ఐపీఎల్ డిపెండింగ్ ఛాంపియన్  గుజరాత్ టైటాన్స్ జోరు కొనసాగుతోంది. నేడు జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై 6వికెట్ల తేడాతో విజయం సాధించింది.  ఢిల్లీ ఇచ్చిన 163 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి 18.1ఓవర్లలోనే ఛేదించింది.  గుజరాత్ బ్యాట్స్ మెన్ సాయి సుదర్శన్ 48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడంతో పాటు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ అందుకున్నాడు.

ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.  ఢిల్లీ జట్టులో కెప్టెన్ డేవిడ్ వార్నర్-37;  అక్షర్ పటేల్-36; సర్ఫరాజ్ ఖాన్ -30; అభిషేక్ పోరెల్-20 పరుగులు చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది.  గుజరాత్ బౌలర్లలలో షమీ, రషీద్ ఖాన్ చెరో మూడు; అల్జారీ జోసెఫ్ రెండు వికెట్లు పడగొట్టారు.

గుజరాజ్ 54 పరుగులకు మూడు వికెట్లు (వృద్దిమాన్ సాహా-14; శుభ్ మన్ గిల్-14; హార్దిక్ పాండ్యా-5) కోల్పోయింది. ఈ దశలో సాయి సుదర్శన్- విజయ్ శంకర్ లు నాలుగో వికెట్ కు 53 రన్స్ జోడించారు. విజయ్ శంకర్ 29 పరుగులు చేసి ఔట్ కాగా, డేవిడ్ మిల్లర్ 16 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 31 పరుగులు సాధించి నాటౌట్ గా క్రీజులో ఉన్నారు.

ఢిల్లీ బౌలర్లలో నార్త్జ్ రెండు; ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్ చెరో వికెట్ పడగొట్టారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్