Saturday, January 18, 2025
Homeస్పోర్ట్స్ఐపీఎల్: ఢిల్లీపై గుజరాత్ గెలుపు

ఐపీఎల్: ఢిల్లీపై గుజరాత్ గెలుపు

IPL-2022: ఐపీఎల్ లో నేడు జరిగిన రెండో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై గుజరాత్ జెయింట్స్ జట్టు 14 పరుగులతో విజయం సాధించింది. బ్యాటింగ్ లో శుభ్ మన్ గిల్ (84) రాణించగా, బౌలింగ్ లో ఫెర్గ్యుసన్ సత్తా చాటి గుజరాజ్ గెలుపులో కీలక పాత్ర పోషించారు.

పూణేలోనే ఎంసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ 2 పరుగుల వద్ద మొదటి వికెట్ (వాడే-1) కోల్పోయింది.  విజయ్ శంకర్ 13 పరుగులు చేసి రెండో వికెట్ గా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ శుభ్ మన్ గిల్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా తో కలిసి మూడో వికెట్ కు 65 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.  పాండ్యా 31 పరుగులు చేసి ఔట్ కాగా,  గిల్ 46 బంతుల్లో 6ఫోర్లు, 4సిక్సర్లతో 84 పరుగులు చేశాడు. చివర్లో డేవిడ్ మిల్లర్(20); తెవాటియా (14) వేగంగా పరుగులు రాబట్టడంతో గుజరాత్ నిర్ణీత యాభై ఓవర్లలో 6 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ముస్తాఫిజూర్ మూడు, ఖలీల్  అహ్మద్ రెండు, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు.

ఢిల్లీ 34 పరుగులకే మూడు వికెట్లు (సీఫెర్ట్-3; పృథ్వీ షా-10; మన్ దీప్ సింగ్-18)  వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ రిషభ్ పంత్- లలిత్ యాదవ్ లు నాలుగో వికెట్ కు 61 పరుగులు జోడించారు. లలిత్ రనౌట్ కావడంతో ఢిల్లీ ఇన్నింగ్స్ మళ్ళీ గాడి తప్పింది. కెప్టెన్ పంత్ కూడా 45 పరుగులు చేసి ఔటయ్యాడు. పావెల్ 20 పరుగులు చేసి రాణించాడు. ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లకు 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో ఫెర్గ్యుసన్ నాలుగు, షమీరెండు, రషీద్ ఖాన్, పాండ్యా చెరో వికెట్ పడగొట్టారు.

నాలుగు వికెట్లు సాధించిన ఫెర్గ్యుసన్ కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

Also Read : ఐపీఎల్: రాజస్థాన్ కు రెండో విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్