Friday, March 29, 2024
Homeస్పోర్ట్స్ఒలింపిక్స్ నిర్వహణకు తొలి మెట్టు: గీత సేథి

ఒలింపిక్స్ నిర్వహణకు తొలి మెట్టు: గీత సేథి

36వ జాతీయ క్రీడలు సెప్టెంబర్ 27 న ప్రారంభం కానున్నాయి. ఈ క్రీడా సంబరాలకు గుజరాత్ ఆతిథ్యం ఇస్తోంది.అక్టోబర్ 10 వరకూ జరగనున్న ఈ క్రీడలలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచీ క్రీడాకారులు తమ  ప్రతిభ కనబరిచేందుకు సిద్ధమవుతున్నారు.

బిలియర్డ్స్ వరల్డ్ మాజీ ఛాంపియన్ గీత సేథి ఈ క్రీడలకు గుజరాత్ ఆతిథ్యం ఇవ్వడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ క్రీడల నిర్వహణ అనేది భవిష్యత్ కాలంలో ఒలింపిక్స్ నిర్వహణకు తొలి మెట్టుగా అభివర్ణించారు. జాతీయ క్రీడల నిర్వహణతో క్రీడారంగంలో అవసరమైన మౌలిక సదుపాయాలను పెన్పెఒన్దుచుకునే వీలుంటుందని, ఇది రాష్ట్రానికి శుభ పరిణామమని పేర్కొన్నారు. ఇదే స్పూర్తితో రాబోయే కాలంలో విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్ నిర్వహణ కూడా సాధ్యపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

జాతీయ క్రీడలకు గుజరాత్ లోని అహ్మదాబాద్, గాంధీ నగర్, సూరత్, వడోదర, రాజ్ కోట్, భవ్ నగర్ క్రీడా మైదానాలు సిద్ధమవుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్