Saturday, November 23, 2024
Homeస్పోర్ట్స్ఐపీఎల్: చెన్నైకి తొమ్మిదో ఓటమి

ఐపీఎల్: చెన్నైకి తొమ్మిదో ఓటమి

9th For CSK: ఐపీఎల్ ఈ సీజన్ లో గుజరాత్ తన ఆధిపత్యం కొనసాగిస్తోంది. నేటితో కలిపి 13 మ్యాచ్ లు ఆడిన ఆ జట్టు 10 విజయాలతో సత్తా చాటింది. మరోవైపు ఇప్పటికే ఐపీఎల్ టోర్నీ ప్లేఆఫ్ కు దూరమైన చెన్నై సూపర్ కింగ్స్ నేడు మరో ఓటమి మూటగట్టుకుంది. నేడు జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్లతో చెన్నైపై విజయం సాధించింది. చెన్నై ఇచ్చిన 134 పరుగుల విజయ లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సాధించింది.

ముంబై వాంఖేడే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో చెన్నై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. జట్టు స్కోరు 8 వద్ద ఓపెనర్ డెవాన్ కాన్వే(5) ఔటయ్యాడు. మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్- మొయిన్ అలీ రెండో వికెట్ కు 57 పరుగులు జోడించారు. మొయిన్ 21; రుతురాజ్ 53 పరుగులు చేసి ఔటయ్యారు. శివమ్ దూబే డకౌట్ కాగా, కెప్టెన్ ధోనీ 7పరుగులే మాత్రమే సాధించి వెనుదిరిగాడు. జగదీషన్ నారాయణ్  39తో నాటౌట్ గా నిలిచాడు. గుజరాత్ బౌలర్లు చక్కని లైన్ అండ్ లెంగ్త్ తో బౌలింగ్ చేయడంతో వేగంగా పరుగులు రాబట్టడంతో ధోనీ సేన విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 133  పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమి రెండు; రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, సాయి కిశోర్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

గుజరాత్ తొలి వికెట్ కు 59 పరుగులు చేసింది. శుభమన్ గిల్ 18 స్కోరు చేశాడు.  మాథ్యూ వాడే 20 పరుగులు చేసి జట్టు స్కోరు 90 వద్ద రెండో వికెట్ గా ఔటయ్యాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా కేవలం 7 మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా 57 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్ తో 67; డేవిడ్ మిల్లర్ 20 బంతుల్లో ఒక ఫోర్ తో 15 పరుగులతో నాటౌట్ గా నిలిచి మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే విజయం అందించారు.

చెన్నైబౌలర్లలో మతీష పతిరణ రెండు; మొయిన్ అలీ ఒక వికెట్ పడగొట్టారు.

వృద్దిమాన్ సాహా కు ‘మ్యాన్ అఫ్ ద మ్యాచ్’ లభించింది.

Also Read : కోల్ కతాపై ఓటమి: హైదరాబాద్ ఔట్

RELATED ARTICLES

Most Popular

న్యూస్