అమెరికాలోని ఓ పాఠశాలలో కాల్పుల ఘటన సంచలనం రేపింది. సౌత్ కారోలీనా టాంగిల్ వుడ్ స్కూల్లో జరిగిన ఈ ఘటనలో తోటి విధ్యార్దులపై కాల్పులు జరిపిన ఏడవ తరగతి విధ్యార్ది. ఓ విధ్యార్ధి మృతి, కాల్పులు జరిపిన విధ్యార్ధిని అదుపులోకి తీసుకున్న గ్రీన్ విల్లే కౌంటీ పోలీసులు. కాల్పుల శబ్దం విన్న వెంటనే అప్రమత్తమైన స్కూలు సిబ్బంది, 20 మంది విధ్యార్దులను కాపాడిన తెలుగు రాష్ట్రానికి చెందిన కోనేరు శ్రీధర్. మాథమ్యాటిక్స్ టీచర్ గా టాంగిల్ వుడ్ స్కూల్లో పని చేస్తున్న శ్రీధర్
కాల్పులు జరిగిన వెంటనే తన క్లాసులో ఉన్న 20 మందిని బెంచిల కింద కూర్చోపెట్టి తలుపులు మూసివేసిన శ్రీధర్. కాసేపటికి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు. విధ్యార్దులను, సిబ్బందిని సురక్షితంగా దగ్గరలోని చర్చిలోకి తరలించిన పోలీసులు. అప్రమత్తంగా వ్యవహరించిన శ్రీధర్ ను అభినందించిన తోటి సిబ్బంది , విధ్యార్దుల తల్లితండ్రులు. విజయవాడ ప్రసాదంపాడు శ్రీధర్ స్వస్థలం.