Wednesday, January 22, 2025
Homeసినిమాసంక్రాంతి బరి నుంచి 'గుంటూరు కారం' ఔట్!

సంక్రాంతి బరి నుంచి ‘గుంటూరు కారం’ ఔట్!

మహేష్‌ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం ‘గుంటూరు కారం’. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ  సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ దీన్ని నిర్మిస్తున్నారు.  ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికి గుంటూరు కారం రిలీజ్ అని ప్రకటించారు కానీ.. ఇప్పుడు సంక్రాంతి పోటీ నుంచి తప్పుకుందని వార్తలు వస్తున్నాయి.

ఇంతకీ విషయం ఏంటంటే.. జూన్ 12 నుంచి తాజా షెడ్యూల్ స్టార్ట్ చేయాలి అనుకున్నారు కానీ.. కో డైరెక్టర్ ఈ మూవీ నుంచి తప్పుకోవడంతో షూటింగ్ కి బ్రేక్ పడిందని ప్రచారం జరిగింది. ఇక ఎండలు ఎక్కువుగా ఉండడంతో జులై నుంచి షూటింగ్ స్టార్ట్ చేయమని త్రివిక్రమ్ కి మహేష్ చెప్పారట. దీంతో త్రివిక్రమ్.. పవన్ కళ్యాణ్  బ్రో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, బన్నీతో యాడ్ షూట్ లో బిజీ అయ్యారట. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి గుంటూరు కారం సంక్రాంతి రేసు నుంచి తప్పుకుందని టాక్ బలంగా వినిపిస్తుంది. దీంతో ఈ వార్త నిజమా..? లేక గ్యాసిప్పా..? అనేది సస్పెన్స్ గా మారింది. మరి.. ప్రచారంలో ఉన్న వార్తల పై మేకర్స్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్