Monday, January 20, 2025
HomeTrending Newsకక్ష సాధింపులో భాగమే: జీవీఎల్  

కక్ష సాధింపులో భాగమే: జీవీఎల్  

issue to be probed: ఉద్దేశ పూర్వకంగానే తిరుపతి ఎయిర్ పోర్ట్ కు నీటి సరఫరా నిలిపివేశారని బిజెపి నేత, రాజ్య సభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ఈ విషయమై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కు జీవీఎల్ లేఖ రాశారు. ఈనెల 10న తిరుపతి విమానాశ్రయానికి నీటి సరఫరాలో అంతరాయంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. మరమ్మతుల కారణంగా నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిందన్న మున్సిపల్ అధికారుల వివరణ అసంబద్ధంగా ఉందని, కేవలం కక్షసాధింపు ధోరణితో ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారని అయన లేఖలో పేర్కొన్నారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని జీవీఎల్ కోరారు. రాష్ట్రంలోని అన్ని ఎయిర్ పోర్ట్ లకు సరైన సేవలందించాలని సిఎం జగన్ కు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్