Sunday, January 19, 2025
Homeసినిమాకేన్సర్ తో పోరాటం చేస్తున్నాను: హంసా నందిని

కేన్సర్ తో పోరాటం చేస్తున్నాను: హంసా నందిని

Hamsa fighting:
హంసా నందిని .. తెలుగు తెరకు తనదైన గ్లామర్ ను పరిచయం చేసిన నాయిక. తెలుగు తెరకి ఆమె పరిచయమై పుష్కర కాలానికి పైనే అయింది. సీనియర్ వంశీ దర్శకత్వం వహించిన ‘అనుమానాస్పదం’ సినిమాతో ఆమెకి గుర్తింపు వచ్చింది. అయితే సెక్సీ లుక్స్ కారణంగా రొమాంటిక్ పాత్రలే ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. స్టార్ హీరోలతో కలిసి ఆమె చేసిన కొన్ని ఐటమ్ సాంగ్స్ కి మంచి పేరు వచ్చింది. ఒకానొక సమయంలో ఐటమ్ నెంబర్స్ వరుసగా చేసి, కుర్రాళ్లను ఒక ఊపు ఊపేసింది. అలాంటి హంసా నందిని గత మూడేళ్లుగా సినిమాలు చేయడం లేదు.

తాను కేన్సర్ బారిన పడ్డానంటూ తాజాగా ఆమె చేసిన పోస్ట్ కి అభిమానులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. “నాలుగు నెలల క్రితం ఒక రోజున నా రొమ్ములో కణితి ఉన్నట్టుగా అనిపించింది. వెంటనే వెళ్లి అందుకు సంబంధించిన డాక్టర్లను కలిశాను. వాళ్లు పరీక్షలు జరపగా అది కేన్సర్ అనీ .. 3వ స్టేజ్ లో ఉందని తేలింది. సర్జరీ చేసి ఆ కణితిని తీసేశారు. అయితే మా అమ్మ కూడా కొంతకాలం క్రితం కేన్సర్ తోనే చనిపోయింది. అందువల్లనే నాకు జన్యుపరమైన కేన్సర్ ఉన్నట్టుగా చెప్పారు. ప్రస్తుతం కీమోలు  నడుస్తున్నాయి” అంటూ ఆమె తాను జుట్టు లేకుండా ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది.

నా జీవితంలో ఇంతకుముందు ఎలాంటి కష్టాలు ఎదురైనా ధైర్యంగానే ఎదుర్కొన్నాను .. ఇప్పుడు కూడా అంతే. నా జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతున్నా ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉన్నాను. కేన్సర్ బాధితురాలిగా దానికి నా జీవితాన్ని అంకితం చేయాలని అనుకోవడం లేదు. నవ్వుతూనే దానిపై పోరాటాన్ని కొనసాగిస్తాను. అందరిలో ఆ విధమైన ప్రేరణ కలిగించడానికే ఈ విషయాన్ని చెబుతున్నాను. పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వస్తాను” అని రాసుకొచ్చింది. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్