Tuesday, January 21, 2025
HomeసినిమాHansika: 'వేధింపు' వ్యాఖ్యలపై హన్సిక క్లారిటీ!

Hansika: ‘వేధింపు’ వ్యాఖ్యలపై హన్సిక క్లారిటీ!

‘దేశముదురు’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అందాల భామ హన్సిక. తొలి సినిమాతోనే అందం, అభినయంతో ఆకట్టుకున్న హన్సిక ఆ తర్వాత నుంచి కెరీర్ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడలేదు. కెరీర్ ఆరంభంలోనే అల్లు అర్జున్, ఎన్టీఆర్, రవితేజ.. ఇలా స్టార్ హీరోలతో నటించే లక్కీ ఛాన్స్ దక్కించుకుంది. తెలుగులో అవకాశాలు తగ్గుతున్న  టైమ్ లో తెలివిగా తమిళ్ లో ఎంట్రీ ఇచ్చింది. అక్కడ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సక్సెస్ ఫుల్ గా రాణిస్తోంది. ఎన్నో విభిన్న పాత్రలతో మెప్పించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఏర్పరుచుకుంది.

తమిళ్ లో హన్సికకు ఏకంగా గుడి కట్టేశారంటే అక్కడ ఎంత క్రేజ్ ఉందో అర్థంచేసుకోవచ్చు. ఒకానొక దశలో స్టార్ హీరో శింబుతో ప్రేమాయణం కోలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకుంటామని కూడా ప్రకటించారు. అయితే ఏమైందో ఏమో కానీ.. ఇద్దరికీ బ్రేక్ అప్ అయ్యింది. తరువాత తెలుగులోకి ఎంట్రీ వరుస సినిమాలు చేస్తూ వచ్చింది. మహా మూవీతో కెరియర్ లో 50 సినిమాల మైలు రాయిని హాన్సిక అందుకుంది. గత ఏడాది తన ఫ్రెండ్, బిజినెస్ మెన్ సోహైల్ ని పెళ్లి చేసుకుంది.

ఇదిలా ఉంటే గత కొద్ది రోజుల నుంచి హాన్సిక కి సంబందించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టాలీవుడ్ లో ఓ అగ్ర హీరో తనని వేధించాడని.. డేటింగ్ చేద్దామంటూ ఫోర్స్ చేసాడని ఆమె చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వేధించిన ఆ టాలీవుడ్ హీరో ఎవరా అనే చర్చ మొదలైంది. అయితే.. ప్రచారంలో ఉన్న ఈ వార్తల పై హన్సిక ట్విట్టర్ లో క్లారిటీ ఇచ్చింది. ఏమైనా వార్తలు ప్రసారం చేసే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. నేను ఎవరి మీద ఎలాంటి కామెంట్స్ చేయలేదు. ప్రచారంలో ఉన్న వార్తల్లో వాస్తవం లేదు అని క్లారిటీ ఇచ్చింది. అదీ.. సంగతి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్