Sunday, January 19, 2025
HomeసినిమాAdipurush: హనుమజ్జయంతి స్పెషల్ పోస్టర్ విడుదల

Adipurush: హనుమజ్జయంతి స్పెషల్ పోస్టర్ విడుదల

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ చిత్రం ఆదిపురుష్‌. రామాయణం ఆధారంగా రూపొందుతోన్న ఈ మూవీలో ప్రభాస్ రాముడుగా నటిస్తుంటే.. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా నటిస్తుంది. సైఫ్ ఆలీఖాన్ రావణుడుగా నటిస్తున్నారు. ఆమధ్య రిలీజ్ చేసిన టీజర్ అంతగా ఆకట్టుకోకపోవడంతో పోస్ట్ ప్రొడక్షన్ మళ్లీ స్టార్ట్ చేశారు. క్వాలిటీ కంటెంట్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో టీమ్ అంతా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. సంక్రాంతికి రావాల్సిన ఈ మూవీని కూడా వాయిదా వేశారు.

ఇటీవల శ్రీరామనవమి సందర్శంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. హనుమాన్ పాత్రధారుడు రాముని జపిస్తూ.. ధ్యానంలో ఉన్న పోస్టర్ ని విడుదల చేశారు. ఈ పోస్టర్ బ్యాక్ గ్రౌండ్ లో రాముడుగా ప్రభాస్ కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. మొత్తానికి స్పెషల్ డేకి అభిమానులు కోరుకున్నట్టుగానే స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. వచ్చే నెల నుంచి ప్రమోషన్స్ లో స్పీడు పెంచనున్నారని సమాచారం. జూన్ 16న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

Also Read : ‘ఆదిపురుష్‌’ ప్రమోషన్స్ కు ముహుర్తం ఫిక్స్

RELATED ARTICLES

Most Popular

న్యూస్