Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్అమిత్ షా తో పాండ్యా సోదరుల భేటీ

అమిత్ షా తో పాండ్యా సోదరుల భేటీ

టీమిండియా టి 20 జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా నేడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. హార్దిక్.. తన సోదరుడు క్రునాల్ పాండ్యాతో కలిసి ఢిల్లీలోని అమిత్ షా నివాసానికి వెళ్ళారు. ఇటీవలే  ఇండియా టి 20 జట్టుకు కెప్టెన్ గా హార్దిక్  నియమితుడైన సంగతి తెలిసిందే.

“మమ్మల్ని ఆహ్వానించి వారి అమూల్యమైన సమయాన్ని మాతో గడిపినందుకు అమిత్ జీకి ధన్యవాదాలు” అంటూ ఆయనతో దిగిన ఫోటోను హార్దిక్ పాండ్యా తన సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేశాడు.

జనవరి 3,5,7 తేదీల్లో శ్రీలంకతో మూడు టి 20మ్యాచ్ లు ముంబై, పూణే, రాజ్ కోట్ వేదికలుగా టీమిండియా ఆడబోతోంది. ఆ తరువాత 10,12,15 తేదీల్లో గువహతి, కోల్ కతా, త్రివేండ్రం లలో మూడు వన్డే మ్యాచ్ లు ఆడుతుంది.

టి 20 జట్టుకు కెప్టెన్ గా ఎంపికైన హార్దిక్ వన్డే జట్టుకు వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.

ఐపీఎల్ 2022 సీజన్ లోనే కొత్తగా ఆరంగ్రేటం చేసిన గుజరాత్ టైటాన్స్ జట్టు  టోర్నమెంట్ విజేతగా నిలిచింది. గుజరాత్ కు కెప్టెన్ గా ఉన్న హార్దిక్ తన నాయకత్వ ప్రతిభతో జట్టును విజయపథంలో నిలిపాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్