Monday, January 20, 2025
Homeస్పోర్ట్స్BCCI: కివీస్ తో సిరీస్ కు పాండ్యా నేతృత్వం- దినేష్ ఔట్

BCCI: కివీస్ తో సిరీస్ కు పాండ్యా నేతృత్వం- దినేష్ ఔట్

హార్దిక్ పాండ్యా టీమిండియా టి20 జట్టుకు సారధ్య బాధ్యతలు చేపట్టనున్నాడు. ప్రస్తుతం జరుగుతోన్న టి20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే టీమిండియా న్యూజిలాండ్ లో పర్యటించనుంది. ఈ సిరీస్ లో భాగంగా మూడు వన్డేలు, మూడు టి 20లు ఆడబోతోంది.  కివీస్ తో జరిగే టి20 జట్టుకు పాండ్యా, వన్డే జట్టుకు శిఖర్ ధావన్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. ఈ సిరీస్ ముగిసిన తర్వాత బంగ్లాదేశ్ తో ఆ దేశంలో జరిగే టెస్టు, వన్డే సిరీస్ కు కూడా జట్టు వివరాలను బిసిసిఐ నేడు  ప్రకటించింది.

  • నవంబర్ 18, 20,22 తేదీల్లో వెల్లింగ్టన్, మంగనూయీ, నేపియార్ లో టి 20 మ్యాచ్ లు;
  • నవంబర్ 25, 27,30 తేదీల్లో ఆక్లాండ్, హామిల్టన్, క్రైస్ట్ చర్చ్ వేదికలుగా వన్డే మ్యాచ్ లు జరగనున్నాయి.

కివీస్ తో టి20 జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్); రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్); శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శామ్సన్, వాషింగ్టన్ సుందర్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అర్ష్ దీప్ సింగ్, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్, ఉమ్రాన్ మాలిక్

ప్రస్తుతం టి20 వరల్డ్ కప్ ఆడుతోన్న జట్టులోనుంచి రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, షమీ, రవిచంద్రన్ అశ్విన్, దినేష్ కార్తీక్, అక్షర్ పటేల్ లకు విశ్రాంతి ఇచ్చారు.

దినేష్ కార్తీక్ ను న్యూజిలాండ్ తో పాటు బంగ్లాదేశ్ టూర్ కూ ఎంపిక చేయలేదు 

కివీస్ తో వన్డే జట్టు: శిఖర్ ధావన్(కెప్టెన్); రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్); శుభ్ మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, సంజూ శామ్సన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, షాబాద్ ఆహ్మద్, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అర్ష్ దీప్ సింగ్, దీపక్ చాహర్, కులదీప్ సేన్, ఉమ్రాన్ మాలిక్

డిసెంబర్ 4,7,10  తేదీల్లో ధాకాలోని నేషనల్ స్టేడియంలో వన్డే మ్యాచ్ లు ….

డిసెంబర్ 14-18 వరకూ చత్తోగ్రాం లో మొదటి టెస్ట్; డిసెంబర్ 22-26  వరకూ ధాకా నేషనల్ స్టేడియంలో రెండో టెస్ట్.. జరగనుంది

బంగ్లాదేశ్ తో వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్); కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్); శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత పటీదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, దీపక్ చాహర్, యష్ దయాల్

బంగ్లాతో టెస్ట్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్); కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్); శుభ్ మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ,  శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్, కెఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్