Sunday, January 19, 2025
Homeసినిమావీరమల్లు రెండు పార్టులా..?

వీరమల్లు రెండు పార్టులా..?

పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పీరియాడిక్ మూవీ ‘హరి హర వీరమల్లు‘. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏఎం రత్నం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ కు జంటగా నిధి అగర్వాల్ నటిస్తుంది. ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ అయిన వీరమల్లు ఇప్పటికీ షూటింగ్ జరుపుకుంటునే ఉంది. ఈ సినిమా ప్రారంభించినప్పటి నుంచి ఇది పీరియాడ్ మూవీ.. మొగలాయిల సామ్రాజ్యం కాలం నాటి కథ అని ప్రచారం జరిగింది కానీ.. అంతకు మించి కథ గురించి ఎలాంటి వార్తలు బయటకు రాలేదు.

తాజా వార్త ఏంటంటే.. తెలంగాణ ప్రాంతానికి చెందిన పండుగలు సాయన్న అనే ఒక బందిపోటు జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. రెండు డిఫరెంట్ టైమ్ పీరియడ్స్ లో ఈ కథ సాగుతుందని టాక్. టీజర్ వచ్చేస్తుందనే వార్తలు తప్పా మూవీ టీం నుండి ఎలాంటి అప్ డేట్లు రావడం లేదు. కరోనాతో షూటింగ్ ఆగిపోవడం పవన్ రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో షూటింగ్ నిలిచిపోయింది. దీంతో ఎప్పుడు పూర్తవుతుందా అని నిర్మాత ఏఎం రత్నం తెగ టెన్షన్ పడుతున్నారట.

అయితే.. వీరమల్లు గురించి ఊహించని అప్ డేట్ ఒకటి ప్రచారంలోకి వచ్చింది. ఏంటంటే.. వీరమల్లు మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారట. ఇదే కనుక జరిగితే పవర్ స్టార్ ఫ్యాన్స్ కు అదిరిపోయే ఆఫర్ అని చెప్పచ్చు. ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం చిత్ర బృందం నుండి అఫీషియల్ గా ప్రకటన రావాల్సి ఉంది. ఎంఎం కీరవాణి అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. ఈ చిత్రాన్ని సమ్మర్ లో రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కుదరడం లేదని.. దసరాకి వస్తుందని సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్