పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ పీరియాడిక్ ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’. ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఏ.ఎం.రత్నం ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే.. ఈ భారీ, క్రేజీ మూవీని ఏ ముహుర్తాన ప్రారంభించారో కానీ.. ఈ సినిమా కంటే వెనకాల స్టార్ట్ చేసిన సినిమాలు పూర్తవ్వడం.. రిలీజ్ అవ్వడం కూడా జరిగింది కానీ.. ఇది మాత్రం అలాగే ఉంది. సమ్మర్ లో వీరమల్లు రిలీజ్ అని ప్రకటించారు కానీ.. కుదరలేదు. ఆతర్వాత దసరాకి వస్తుంది అనుకున్నారు కానీ.. అది జరగడం లేదు.
సంక్రాంతికి అయినా విడుదల చేద్దామనుకుంటే.. అదీ అయ్యేట్లు కనిపించడం లేదు. సుజిత్ డైరెక్షన్ లో ‘ఓజీ’, హరీష్ శంకర్ డైరెక్షన్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, సముద్రఖని డైరెక్షన్ లో ‘వినోదయ సీతమ్’ రీమేక్ శరవేగంగా షూటింగ్ జరుపకుంటున్నాయి. ఈ సినిమాల పై దృష్టి పెట్టినట్టుగా వీరమల్లు పై దృష్టి పెట్టడం లేదు. వీరమల్లు పూర్తవ్వాలంటే.. పవన్ కళ్యాణ్ ఓ నలభై రోజులు వర్క్ చేయాల్సివుంటుంది. గట్టిగా తలుచుకుంటే.. పూర్తవుతుంది కానీ.. పవన్ నుంచి ఎలాంటి సహకారం అందడం లేదు అని టాక్ వినిపిస్తుంది.
జూన్‌లో వీరమల్లుకి కాల్షీట్లు ఇస్తానని పవన్ మాటిచ్చారట కానీ.. ఇప్పుడు పవన్ మైండ్ సెట్ మారిందట. 2024 ఎన్నికల తర్వాతే… వీరమల్లుని విడుదల చేయాలనుకొంటున్నాడట. అయితే.. క్రిష్ వీరమల్లు చిత్రాన్ని రెండు పార్టులుగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటి వరకు షూటింగ్ చేసిన దానికి కొన్ని సీన్స్ యాడ్ చేసి.. ఫస్ట్ పార్టుగా విడుదల చేయాలనేది ఆలోచన అని తెలిసింది. నిర్మాతకు ఆర్ధిక భారం తగ్గుతుందని ఇలా ప్లాన్ చేస్తున్నారట. ప్లాన్ బాగానే ఉంది. మరి.. ఫస్ట్ పార్ట్ అయినా ఎప్పటికీ వస్తుందో..?