Sunday, January 19, 2025
Homeసినిమాహ‌రి హ‌ర వీర‌మ‌ల్లు న్యూ టార్గెట్ ఇదే

హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు న్యూ టార్గెట్ ఇదే

At last: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, విభిన్న క‌థా చిత్రాల ద‌ర్శ‌కుడు క్రిష్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు. ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాలి కానీ.. క‌రోనా కార‌ణంగా.. అలాగే ప‌వ‌న్ పాలిటిక్స్ లో బిజీ కార‌ణంగా షూటింగ్ వాయిదా ప‌డుతూనే ఉంది. అయితే.. ఇది ప‌వ‌న్ న‌టిస్తున్న ఫ‌స్ట్ పాన్ ఇండియా మూవీ కావ‌డంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని అభిమానులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.

ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ కి రిలీజ్ చేయాలి అనుకున్నారు కుద‌ర‌లేదు. ఆత‌ర్వాత ద‌స‌రాకి రిలీజ్ అంటూ వార్త‌లు వ‌చ్చాయి. ఇప్పుడు ద‌స‌రా కాదు.. సంక్రాంతికి రిలీజ్ అంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పుడు హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు న్యూ టార్గెట్ ఇదే అని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే… సగానికి పైగా షూటింగ్ బ్యాలెన్స్ ఉండడంతో ఈ సినిమాను ఎప్పుడు పూర్తి చేస్తారు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది.

పవన్ కళ్యాణ్ అక్టోబ‌ర్ నుంచి రాజకీయాల్లో మ‌రింత‌గా బిజీ అవుతారు. అందుచేత ఈ గ్యాప్ లోనే హరిహర వీరమల్లు సినిమాలు పూర్తి చేయాల్సి ఉంటుంది. అంటే మూడు నెలల్లో మిగతా 50% షూటింగ్ పూర్తి చేయడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. క్రిష్ రెండు నెలల్లో కూడా సినిమాను పూర్తి చేయగలడు కానీ మిగతా ఆర్టిస్టుల డేట్స్ అనుకున్న సమయానికి దొరకాలంటే చాలా కష్టమైన పని. కాబట్టి ఈ కొత్త టార్గెట్ ను క్రిష్ ఎంత వ‌ర‌కు రీచ్ అవుతాడో..?   వీర‌మ‌ల్లును ఎప్ప‌టికీ పూర్తి చేస్తాడో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్