Saturday, January 18, 2025
Homeసినిమావీరమల్లు టార్గెట్ రీచ్ అవుతాడా..?

వీరమల్లు టార్గెట్ రీచ్ అవుతాడా..?

పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు‘. ఈ చిత్రానికి క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఏఎం రత్నం ఈ చిత్రాన్న నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ నటిస్తుంది. ఈ సినిమా ఎప్పుడో పూర్తవ్వాలి… ఎప్పుడో థియేటర్లోకి రావాల్సింది కానీ.. షూటింగ్ అనుకున్న విధంగా జరగకపోవడంతో వీరమల్లు ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. ప్రస్తుతం వీరమల్లు షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతుంది. పవన్ కళ్యాణ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

అయితే.. దర్శకుడు క్రిష్ పవన్ కళ్యాణ్ లేకపోయినప్పటికీ అతనితో అవసరం లేనటువంటి కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలి అని ఈ వచ్చే ఎన్నికల వరకు మరొక సినిమా షూటింగ్ పెట్టుకోకూడదని డిసైడ్ అయ్యారట. ఒక వైపు రాజకీయాల్లో పాల్గొంటూనే మరొక వైపు హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఫినిష్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక దర్శకుడు క్రిష్ కూడా ఈసారి ప్రక్క ప్రణాళికతో  షూటింగ్ ఫినిష్ చేయాలనుకుంటున్నాడు.

ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను 2023 సమ్మర్లో విడుదల చేయాలి అని టార్గెట్ పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. 2023 సంక్రాంతిని మిస్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు వచ్చే సమ్మర్ ను ఏ మాత్రం మిస్ చేసుకోకూడదు అనుకుంటున్నారట. పవన్ కళ్యాణ్ తో ఇది వరకే రెండుసార్లు చర్చలు జరిపారు. పవన్ కూడా మరొక సినిమా షూటింగ్ పెట్టుకొనని కేవలం ఈ సినిమా కోసమే పని చేస్తాను అని మాట ఇచ్చారని సమాచారం. మరి అనుకున్నట్లుగా ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కు వస్తుందో లేదో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్