Sunday, January 19, 2025
Homeసినిమాఉస్తాద్ కోసం మార్పులు చేర్పులు

ఉస్తాద్ కోసం మార్పులు చేర్పులు

పవన్ కళ్యాణ్‌, హరీష్ శంకర్ కాంబినేషన్లో గబ్బర్ సింగ్ మూవీ రూపొందడం.. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. అప్పటి నుంచి ఈ క్రేజీ కాంబోలో మరో మూవీ వస్తే.. చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆఖరికి అభిమానులు కోరుకున్నట్టుగానే.. పవన్, హరీష్ శంకర్ కాంబోలో ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమాను అనౌన్స్ చేశారు. ఎప్పటి నుంచో వార్తల్లో ఉన్న ఈ సినిమాకి టైటిల్ మార్చారు.. భవదీయుడు భగత్ సింగ్ కాస్తా.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అయ్యింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

అయితే.. హరీష్ శంకర్ ముందుగా స్ట్రైయిట్ మూవీ చేయాలి అనుకున్నారట కానీ.. లాస్ట్ మినిట్ లో కథ మారిందని తెలిసింది. అవును… హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో చేస్తుంది రీమేక్. ఇంతకీ ఏ మూవీ రీమేక్ అంటే… తెరి రీమేక్ అని తెలిసింది. అయితే.. రీమేక్ కథగా తెరకెక్కుతున్న కూడా ఈ మూవీలో హరీష్ శంకర్ తనదైన శైలిలో మార్పులు చేర్పులు చేశారని తెలుస్తుంది. గతంలో హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో దబాంగ్ సినిమాని గబ్బర్ సింగ్ గా రీమేక్ చేశారు. దబాంగ్ మూవీ కంటే బాగుంది. గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

అలాగే జిగార్తాండ మూవీని గద్దలకొండ గణేష్ గా రీమేక్ చేశారు. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ నేపధ్యంలో హరీష్ శంకర్ కి రీమేక్ విషయంలో పెర్ఫెక్ట్ స్టైల్ ఉంటుంది అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఉస్తాద్ భగత్ సింగ్ క్యారెక్టర్ ని హరీష్ డిజైన్ చేశారట. ఈ సినిమా కోసం పవర్ స్టార్ 40 రోజులు డేట్స్ ఇచ్చారని తెలిసింది. తెరి మూవీలో విజయ్ పోలీసాఫీసర్ గా నటిస్తే.. పవన్ ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో కాలేజీ లెక్చరర్ గా కనిపిస్తారట. అలాగే కూతురు పాత్రని కొడుకు పాత్రగా మార్చారని తెలిసింది. మరి.. ఈ మూవీతో పవన్, హరీష్ శంకర్ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్