Saturday, November 23, 2024
HomeTrending Newsప్రజలందరికీ కంటి పరీక్షలు - మంత్రి హరీష్ రావు

ప్రజలందరికీ కంటి పరీక్షలు – మంత్రి హరీష్ రావు

రాష్ట్ర ప్రజలకు కంటి సమస్యలు దూరం చేసే లక్ష్యంతో జనవరి 18 నుండి ప్రారంభిస్తున్న రెండో దఫా కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సహా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిదులందరిని భాగస్వామ్యం చేయాలన్నారు. మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమం 8 నెలలు జరిగిందని, రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం వంద వర్కింగ్ డేస్ లలో పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం కంటి వెలుగు కార్యక్రమంలో గతం కంటే టీమ్ లు పెంచిందన్నరు. మొదటి సారి 827 బృందాలు పని చేస్తే, ఇప్పుడు 1500 ఏర్పాటు చేసిందన్నారు.

రాష్ట్ర ప్రజలందరికీ పరీక్షలు చేసి ఉచితంగా అద్దాలు పంపిణీ చేస్తామన్నారు. ఇందులో 30 లక్షల రీడింగ్ గ్లాసెస్, 25 లక్షల ప్రిస్క్రిషన్ గ్లాసెస్ ఉంటాయని, కార్యక్రమం ప్రారంభానికి ముందుగానే అవసరమైన అద్దాలు ఆయా జిల్లాలోకి పంపిణీ చేయడం పూర్తి చేయాలన్నారు. పరీక్షలు చేసిన నెల రోజుల్లో ప్రిస్క్రిప్షన్ అద్దాలు పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం 200 కోట్లు మంజూరు చేసిందన్నారు. మున్సిపల్, పంచాయితీ రాజ్ అధికారులతో చర్చించి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్లాన్ చేసుకోవాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులతో జిల్లా వారీగా మీటింగ్ ఏర్పాటు చేయాలనీ, ఏ రోజు ఎక్కడ క్యాంపు నిర్వహించాలో పకడ్బందీ కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు.

జిల్లాలో 5 శాతం బఫర్ టీమ్ ( అడ్వాన్స్ టీమ్) లు పెట్టుకోవాలన్నారు. బృందాలకు అవసరం అయ్యే ఏర్పాట్లు చేయాలనీ, మహిళా ఉద్యోగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్షలు చేసుకోవడం మిస్ అయిన వారీ కోసం కూడా మళ్ళీ ఏర్పాటు చేయాలన్నారు. స్టేట్ లెవెల్ 10 క్వాలిటీ కంట్రోల్ టీం, జిల్లాల్లోకొక క్వాలిటీ కంట్రోల్ టీమ్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వీరు ప్రభావవంతంగా కార్యక్రమం జరుగుతుందా లేదా అని పరిశీలన చేస్తారన్నారు. 960 వైద్యులను వారం రోజుల్లోగా కొత్తగా నియమాకాలు చేస్తున్నామన్నరు. జగిత్యాల కలెక్టరెట్ లో జరిగిన సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ శ్వేత, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్, జిల్లా అదనపు కలెక్టర్ మందా మకరంద్ పాల్గొనగా, హైదరాబాద్ నుండి హాజరైన వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్