Sunday, January 19, 2025
HomeTrending Newsకేంద్ర మంత్రులది పూటకో మాట - మంత్రి హరీష్

కేంద్ర మంత్రులది పూటకో మాట – మంత్రి హరీష్

కేంద్ర ప్రభుత్వం ఎయిమ్స్ పరువు తీసిందని, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎయిమ్స్ వెళ్లి చూస్తే అన్నీ తెలుస్తాయని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ రోజు వరకు ఎయిమ్స్ లో ఒక్క కాన్పు, ఆపరేషన్ కాలేడని హరీష్ రావు విమర్శించారు. అదే భువనగిరి ఏరియా ఆసుపత్రిలో 1083 డెలివరీలు అయినాయని, రామన్నపేట ఏరియా ఆసుపత్రుల్లో 245 డెలివరీలు, చౌటుప్పల్ లో 214 డెలివరీలు జరిగాయని మంత్రి వెల్లడించారు. మేడ్చల్ లో 50 పడకల ఎంసీహెచ్ ఆసుపత్రికి శంకుస్ధాపన చేసిన ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి. బీబీ నగర్ ఎయిమ్స్ ఉన్న అర్బన్ పీహెచ్ సీ లో 13 డెలివరీలు అయినయి. మీ ఎయిమ్స్ లో ఒక్కటంటే ఒక్క డెలివరీ కాలేదు. ఇది మీ బీజేపీ పని తీరు. ఇది కేంద్ర ప్రభుత్వ పని తీరు. మాటలు ఎక్కువ- చేతలుత క్కువ. పేరు గొప్ప- ఊరు దిబ్బ లెక్క ఉందని కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టారు.

నాలుగేళ్ళుగా కేంద్ర మంత్రిగా ఉన్నకిషన్ రెడ్డి అక్కడకు వెళ్లి పట్టించుకోవచ్చు కదా. మేం రోజు ఆసుపత్రులు తిరుగుతున్నం. 61 శాతం ఇవాళ తెలంగాణ ఆసుపత్రుల్లో డెలివరీలు జరుగుతున్నయి. తెలంగాణ వచ్చినప్పుడు 30 శాతం ఉండే ఆనాడు. 31 శాతం పెరిగింది.వసతులు పెరిగాయి . ప్రజలకు నమ్మకం పెరిగింది. అది మా పని తీరు… మీ పని తీరు సున్న. ఇప్పుటికైనా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పట్టించుకోండన్నారు.కేంద్రప్రభుత్వం 157 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇవ్వగా.. కిషన్ రెడ్డి ఒక్కటైనా తెచ్చిండ్రా.. తెలంగాణ సీఎం జిల్లాకో మెడికల్ కాలేజి ఇచ్చారని మంత్రి హరీష్ చెప్పారు..

బైరాన్ సింగ్ షెకావత్ కేంద్ర మంత్రి వచ్చిండు.. ఢిల్లీలో ఓ మాట..పార్లమెంట్ లో ఓ మాట ఉంటుందని మంత్రి హరీష్ ఎద్దేవా చేశారు. జనవరి 2022 లో కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం అన్ని అనుమతులు ఇచ్చింది. 18 లక్షల కొత్త ఆయకట్టు, మరో పద్దెనిమిదన్నర లక్షల ఎకరాలకు స్థిరీకరణ చేసే ప్రాజెక్టు అని, కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పారు. పార్లమెంట్లో చెప్పి గల్లీ బీబీ నగర్ లో ఏం చెప్పిండు.. కాళేశ్వరంకు అనుమతులు లేవంటడు, ఫారెస్ట్, ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్ లేదంటడు. అవినీతి జరిగిందని అంటడు. ఐదు నెలల క్రితమే పార్లమెంట్ లో ఏం చెప్పినవు.. ఇప్పుడు అబద్దాలు చెబుతున్నరని విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని అనుమతులు ఉన్న కాగితాలు తెచ్చా… సెంట్రల్ వాటర్ కమిషన్ అన్ని అనుమతులు ఇచ్చింది. ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్ 2017, 22 డిసెంబర్ ఇచ్చింది. అటవీ శాఖ అనుమతి 2017, 24 నవంబర్ లో వచ్చింది. అనుమతి ఇచ్చింది వాళ్లే… అనుమతి ఇవ్వలేదని ఇక్కడ అంటరని హరీష్ రావు మండిపడ్డారు. అది నోరా..మోరీనా…గల్లీలో ఓ మాట..ఢిల్లీలో ఓ మాట. పార్లమెంట్ లో ఓ మాట..ప్రజా క్షేత్రంలో ఓ మాట. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు లైఫ్ లైన్. తెలంగాణకు గొప్ప ప్రాజెక్టు. మన మేడ్చేల్ నియోజకవర్గంలో, శామిర్ పేట చెరువులో రెండు మూడు నెలల్లో నీళ్లు పడతాయి. రావల్ కోల్ కేనాల్ ద్వారా మెడ్చెల్ కు కాళేశ్వరం నీరు వస్తుందని మంత్రి పేర్కొన్నారు.

మోదీ ఉచితాలు వద్దు అంటన్నడు. రైతులకు 24 గంటల ఉచిత్ విద్యుత్, ఉచితంగా 5 లక్షల బీమా వద్దంట. పేద మహిళలకు ఆస,రా పెన్షన్ 2016 వద్దంటున్నరా ..కళ్యాణ లక్ష్మికి లక్ష రూపాయలు ఇస్తున్నం అది వద్దంటరా మీరు.. ఏ ఉచితాలు వద్దంట… పేదలకు ఉచితాలు వద్దంట…బడా బడా కంపెనీలకు 12 లక్షలకోట్లు రుణాలు రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం. ఎవరు పేదల కోసం పని చేస్తున్నరు. ఎవరు బడా బడా పారిశ్రామిక వేత్తల కోసం పని చేస్తున్నరు..ప్రజలు ఆలోచించాలని మంత్రి హరీష్ రావు చెప్పారు.

Also Read బిజేపి అంటేనే జూటా పార్టీ మంత్రి హరీష్ రావు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్