Sunday, January 19, 2025
HomeTrending Newsపాలమూరుకు హోదా తెండి: హరీష్ సవాల్

పాలమూరుకు హోదా తెండి: హరీష్ సవాల్

National Status: బిజెపి నేతలకు దమ్ముంటే పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా తేవాలని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి టి. హరీష్ రావు డిమాండ్ చేశారు. ఎరువుల రేట్లు పెంచి రైతులకు పెట్టుబడి వ్యయాన్ని పెంచుతారని, రాష్ట్రంలో కనీసం ఒక్కజాతీయ ప్రాజెక్ట్ కూడా మంజూరు చేయరని… బిజెపి నాయకులు కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇలా అన్ని వర్గాల వారికి, అన్ని విషయాల్లో బీజేపీ నష్టం చేసిందన్నారు.

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ లో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, కార్పోరేషన్ ఛైర్మన్ సాయిచంద్, అధికారులు పాల్గొన్నారు

ఈ సందర్భంగా జరిగిన సభలో హరీష్ రావు మత్లాడుతూ 317 జీవో రద్దు అంటే.. నిరుద్యోగులకు ఉద్యోగాలు వద్దు అన్నట్టేనని, కొందరు దీనిపై కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా 317 జీఓ వచ్చిందని, జిల్లాల్లో స్థానికులకు ఉద్యోగాలు దక్కుతాయని వివరించారు. ఈ ప్రక్రియ పూర్తి అయితే ఖాళీగా ఉన్న 60, 70 వేల ఉద్యోగాలను నింపాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని వెల్లడించారు.

బిజెపి నేతలకు నిరుద్యోగుల మీద ప్రేమ లేదని,  కేవలం రాజకీయం కోసం మాట్లాడుతున్నారని, ఎవరి మీద పోరాటం చేస్తున్నారో బిజెపి నేతలు ఆలోచించుకోవాలని సూచించారు.  పేదలకు ఉద్యోగాలు రావొద్దని వారు పోరాటం చేస్తున్నట్లుందని ఎద్దేవా చేశారు. నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే కేంద్రం వద్ద ఖాళీగా ఉన్న  10లక్షల 62 వేల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేసేలా ప్రయత్నాలు చేయాలన్నారు. ఆ ఉద్యోగాల భర్తీ చేయకుండా నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారని హరీష్ రావు వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్