Saturday, January 18, 2025
Homeసినిమాతెలుగు ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమే స్వాతి రెడ్డి: హరీశ్ శంకర్  

తెలుగు ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమే స్వాతి రెడ్డి: హరీశ్ శంకర్  

‘పంచతంత్ర కథలు’ ఎంతటి ప్రాధాన్యతను సంతరించుకున్నాయనేది అందరికీ తెలిసిందే. ‘పంచతంత్రం’ టైటిల్ తో గతంలో కూడా కొన్ని సినిమాలు  వచ్చాయి. ఇప్పుడు అదే టైటిల్ తో మరో సినిమా వస్తోంది. అయితే దీని కంటెంటు .. కాన్సెప్టు పూర్తిగా డిఫరెంట్. సృజన్ – అఖిలేశ్ నిర్మించిన ఈ  సినిమాకి హర్ష పులిపాక దర్శకత్వం వహించాడు. బ్రహ్మానందం .. స్వాతి రెడ్డి .. శివాత్మిక .. దివ్య శ్రీపాద ముఖ్యమైన పాత్రలను పోషించారు.

ఈ నెల 9వ తేదీన ఈ సినిమా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి జరిగింది. ఈ ఫంక్షన్ కి ముఖ్య అతిథిగా వచ్చిన హరీశ్ శంకర్ మాట్లాడుతూ .. ‘పంచతంత్రం’ కథలను నేను చిన్నప్పుడు చదివాను. ఇంతమంచి టైటిల్ ను సెట్ చేయడంతోనే దర్శకుడు సగం సక్సెస్ ను సాధించాడనేది నా అభిప్రాయం. నేను ఒక కథ రాసుకోవడానికే రెండుమూడేళ్లు పడుతోంది. తను ఒక సినిమా కోసం ఐదు కథలను రాసుకోవడం గొప్ప విషయం.

ఈ సినిమాలో యాక్ట్ చేసిన అమ్మాయిలంతా తెలుగువారే కావడం ఆనదించవలసిన విషయం. తెలుగు హీరోయిన్స్ ను ప్రోత్సహించాలని నాకూ ఉంటుంది. కానీ అది అన్ని సందర్భాల్లోను కుదరడం లేదు అంతే. స్వాతి రెడ్డి నా ఆల్ టైమ్ క్రష్. తన లాంటి ఆర్టిస్ట్ దొరకడం తెలుగు ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం. ఇది చిన్న సినిమా అంటున్నారు. రిలీజ్ తరువాతనే కదా ఆ విషయం తెలిసేది. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్