Saturday, January 18, 2025
Homeసినిమాహ‌రీష్ శంక‌ర్ మూవీ ఎవరితో?

హ‌రీష్ శంక‌ర్ మూవీ ఎవరితో?

గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాతో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ సాధించి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన టాలెంటెడ్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ తో మ‌ళ్లీ హ‌రీష్ శంక‌ర్ సినిమా చేస్తే చూడాల‌ని మెగా అభిమానులు కోరుకున్నారు. అయితే.. కోరుకున్న‌ట్టుగానే ఇన్నాళ్ల‌కి ఈ క్రేజీ కాంబినేష‌న్ సెట్ అయ్యింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, హ‌రీష్ శంక‌ర్ కాంబినేష‌న్లో.. భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్ అనే సినిమా చేయ‌నున్న‌ట్టుగా ప్ర‌క‌టించారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

అయితే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీ కావ‌డం వ‌ల‌న ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌లేదు. ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో క్లారిటీ లేదు. దీంతో హ‌రీష్ శంక‌ర్ వేరే హీరోతో సినిమా చేయాల‌ని ఫిక్స్ అయ్యాడ‌ట‌. ఇటీవ‌ల హ‌రీష్ శంక‌ర్.. బ‌న్నీని క‌లిసారు. దీంతో వీరిద్ద‌రి కాంబినేష‌న్లో మూవీ అంటూ వార్త‌లు వ‌చ్చాయి. ఇటీవ‌ల దువ్వాడ జ‌గ‌న్నాథ్ సినిమా 5 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా వీరిద్ద‌రూ క‌లిసిన‌ప్పుడు సినిమా గురించి చ‌ర్చించుకున్నార‌ని టాక్.

లేటెస్ట్ న్యూస్ ఏంటంటే… హ‌రీష్ శంక‌ర్ ఎన‌ర్జిటిక్ హీరో రామ్ తో సినిమా చేయ‌నున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం బోయ‌పాటితో సినిమా చేస్తున్న రామ్ త‌ర్వాత సినిమా హ‌రీష్ శంక‌ర్ తోనే అని టాక్ బ‌లంగా వినిపిస్తుంది. దీంతో హ‌రీష్ శంక‌ర్ మూవీ బ‌న్నీతోనా..?  రామ్ తోనా..? అనేది ఆస‌క్తిగా మారింది. అలాగే బ‌న్నీ రిజెక్ట్ చేస్తే.. రామ్ తో ఫిక్స్ అయ్యిందా..?  లేదా బ‌న్నీని మామూలుగానే క‌లిసాడా..? అనేది కూడా చ‌ర్చ‌నీయాంశం అయ్యింది. మ‌రి.. హ‌రీష్ శంక‌ర్ ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త‌ల పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Also Read హ‌రీష్ శంక‌ర్ కి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన మెగాస్టార్.? 

RELATED ARTICLES

Most Popular

న్యూస్