Sunday, January 19, 2025
Homeసినిమా హరీష్ శంకర్ చేతుల మీదుగా "దోచేవారెవరురా" ట్రైలర్ విడుదల

 హరీష్ శంకర్ చేతుల మీదుగా “దోచేవారెవరురా” ట్రైలర్ విడుదల

IQ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రణవచంద్ర.. మాళవిక సతీషన్,  అజయ్ గోష్. బిత్తిరి సత్తి.. మాస్టర్ చక్రి. జెమిని సురేష్. నటీ నటులుగా సీనియర్ దర్శకుడు శివ నాగేశ్వరావు దర్శకత్వంలో బొడ్డు కోటేశ్వరరావు నిర్మించిన సరికొత్త కామెడీ థ్రిల్లర్ చిత్రం “దోచేవారెవరురా”.ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు.. తనికెళ్ళ భరణి,. బెనర్జీ అతిధి పాత్రలలో  కనిపించనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 11 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ప్రముఖ దర్శకులు హరీష్ శంకర్ చిత్ర ట్రైలర్ ను విడుదల చేయగా.. నటులు ఉత్తేజ్, హర్ష వర్ధన్, దర్శకులు ప్రణీత్ లు చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెష్ తెలియజేశారు.

దర్శకులు హరీష్ శంకర్ మాట్లాడుతూ… ప్రతి హీరోలో ఒక డైరెక్టర్ ఉంటాడు. ప్రతి డైరెక్టర్ లో ఒక హీరో ఉంటాడు. అయితే  వీరిలోని వారు, వారిలోని వీరు బయటకు  రాకూడదు. అలాగే చాలా మంది సినిమాను సెలెక్ట్ చేసుకున్నాం  అంటారు కానీ.. సినిమా మీద ప్యాషన్ ఉన్నవాడిని  సినిమానే  సెలెక్ట్ చేసుకుంటుంది తప్పా సినిమాను మనం సెలెక్ట్ చేసుకోం. శివ నాగేశ్వరావు గారు చాలా సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తి. తనకున్న సెన్సాఫ్ హ్యూమర్ మాకు లేదు. తను ఎన్నో మంచి సినిమాలు ప్రేక్షకులకు అందించాడు. మళ్ళీ ఇప్పుడు మంచి కథతో వస్తున్న ఈ సినిమా ట్రైలర్, పాటలు బాగున్నాయి. ఇందులో నటించిన నటులకు, టెక్నిషియన్స్ కు, నిర్మాతలకు ఈ సినిమా బిగ్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్