Saturday, November 23, 2024
HomeTrending Newsతెలంగాణలో 7.7 శాతం పెరిగిన గ్రీన్‌కవర్‌ - మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

తెలంగాణలో 7.7 శాతం పెరిగిన గ్రీన్‌కవర్‌ – మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల వల్ల పచ్చదనం పెరిగిందని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. 2015 నుంచి 2021 సంవ‌త్సరాల మ‌ధ్య పచ్చదనం (గ్రీన్ కవర్) శాతం 7.70 శాతం పెరిగినట్లు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా (IFSR) ప్రకటించిందన్నారు. పచ్చదనం పెరగడంపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిదని తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్భంగా హరితహార కార్యక్రమం, పచ్చదనం పెంపుకు తీసుకుంటున్న చర్యలు, తదితర అంశాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి పెద్దఎత్తున పనులు చేపడుతున్నామన్నారు.

హరితహారం కార్యక్రమం ద్వారా అడవుల లోపల, వెలుపల పెద్దఎత్తున మొక్కలు పెంచాలని నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగా 2022-23లో 19.29 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా, 2023-2024లో 20.02 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నామని వెల్లడించారు. మొక్కల పెంపక కార్యక్రమాలు చేపట్టడానికి గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలకు బడ్జెట్‌లో 10 శాతం గ్రీన్‌ బడ్జెట్‌గా కేటాయించామన్నారు. మొక్కల పెంపకం సక్రమంగా పర్యవేక్షణ జరిగేలా చూడటానికి జియో ట్యాగింగ్‌ ఆఫ్‌ ప్లాంటేషన్స్‌ను చేపట్టామని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్