Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్ప్రొ కబడ్డీ: హర్యానా, జైపూర్ విజయం

ప్రొ కబడ్డీ: హర్యానా, జైపూర్ విజయం

Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో నేడు జరిగిన మ్యాచ్ ల్లో హర్యానా స్టీలర్స్, జైపూర్ పింక్ పాంథర్స్  జట్లు విజయం సాధించాయి

హర్యానా స్టీలర్స్- బెంగాల్ వారియర్స్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో 41-37 తో హర్యానా విజయం సాధించింది. తొలి అర్ధ భాగంలో  బెంగాల్ 18-15 తో ఆధిక్యం సంపాదించగా రెండో అర్ధ భాగంలో హర్యానా దీటుగా ఆడి 26-19 తో పైచేయి సాధించింది. దీనితో చివరకు నాలుగు పాయింట్ల తేడాతో హర్యానా గెలుపొందింది. బెంగాల్ కెప్టెన్ మణీందర్ సింగ్ 14 పాయింట్లు సాధించినా ఫలితం లేకపోయింది. హర్యానాలో కెప్టెన్ వికాస్ 9, మీతూ 10 పాయింట్లు సాధించి విజయంలో కీలక పాత్ర పోషించారు.

జైపూర్ పింక్ పాంథర్స్-పునేరి పల్టాన్ మధ్య జరిగిన  రెండో మ్యాచ్ లో జైపూర్ 31-26 తో విజయం సాధించింది. తొలి అర్ధ భాగంలో జైపూర్ 18-17తో స్వల్ప ఆధిక్యం సంపాదించింది. రెండో అర్ధభాగంలో పునేరి మెరుగ్గా ఆడినప్పటికీ చివరి ఐదు నిమిషాల్లో పింక్ పాంథర్స్ మళ్ళీ పుంజుకుని 13-9 తో తమ ఆధిపత్యం నిలబెట్టుకుంది. ఐదు పాయింట్ల తేడాతో విజయం సాధించింది.

నేటి మ్యాచ్ లు పూర్తయిన తరువాత బెంగుళూరు మళ్ళీ ఆధిక్యంలో నిలిచి నంబర్ వన్ స్థానంలో నిలిచింది. బెంగుళూరు బుల్స్ (28 పాయింట్లు); దబాంగ్ ఢిల్లీ (26); పాట్నా పైరేట్స్ (24); తమిళ్ తలైవాస్ (22); యూ ముంబా(20); హర్యానా స్టీలర్స్ (20); జట్లు టాప్ సిక్స్ లో ఉన్నాయి.

Also Read : ప్రొ కబడ్డీ:  బెంగుళూరుకు మరో విజయం

RELATED ARTICLES

Most Popular

న్యూస్