Sunday, January 19, 2025
HomeTrending Newsహెచ్.సి.యు ఎన్నికలు... విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ

హెచ్.సి.యు ఎన్నికలు… విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ

గచ్చిబౌలిలోని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (HCU)లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వర్సిటీలో విద్యార్థి సంఘాల నాయకులు పరస్పరం దాడులు చేసుకున్నారు. వర్సిటీలో త్వరలో స్టూడెంట్‌ యూనియన్‌ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) అనుబంధంగా ఉండే అఖిల భారత విద్యార్థి పరిషత్‌ (ABVP), కమ్యూనిస్టు పార్టీకి చెందిన స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (SFI)కు చెందిన విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

వివరాల్లోకి వెళితే ..

నిన్న రాత్రి ఎలక్షన్ ముగిసిన తర్వాత ఒంటి గంటకి ఎబివిపి పోస్టర్లును కేరళ కి చెందిన sfi విద్యార్థి చెంచి వేస్తుండగా ప్రశ్నించిన రాజేందర్ నాయక్, సిద్దం శుక్ల, ఆకాశ్ బాటి అనే ఎబివిపి విద్యార్థుల పై దాడి చేసిన ఎస్ఎఫ్ఐ విద్యార్థులు. జే హాస్టల్లో వాటర్ పట్టుకుంటు ఉండగా ఏబీవీపీ పోస్టర్లను చించుతుండగా ప్రశ్నించిన రాజేందర్ నాయక్ పై దాడి చేసిన ఎస్ఎఫ్ఐ విద్యార్థులు. దీంతో ఆగకుండా అక్కడే ఉన్న అద్దం పగలగొట్టి ఆ అద్దంతో దాడి చేసి గాయపరిచిన ఎస్ఎఫ్ఐ విద్యార్థులు. తీవ్ర గాయాల పాలైన రాజేందర్ నాయక్ సిద్దాం శుక్ల, ఆకాశ బాటి అనే ఏబీవీపీ విద్యార్థులకు తీవ్ర గాయాలు… గచ్చిబౌలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు. రెండు గ్రూపులుగా విడిపోయి దాడులు చేసుకున్న విద్యార్థులు. దీంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు .

RELATED ARTICLES

Most Popular

న్యూస్