Saturday, November 23, 2024
HomeTrending NewsGift a smile: వెయ్యి మంది వీడియో జర్నలిస్ట్ లకు హెల్త్ కార్డ్ లు

Gift a smile: వెయ్యి మంది వీడియో జర్నలిస్ట్ లకు హెల్త్ కార్డ్ లు

రాష్ట్ర మంత్రి, BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు సోమవారం PV మార్గ్ లోని థ్రిల్ సిటీ థీమ్ పార్క్ లో యువనేత, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. వేడుకలకు హోంమంత్రి మహమూద్ అలీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. వీరితో పాటు MLC లు ప్రభాకర్ రావు, ఎగ్గే మల్లేశం, స్టీఫెన్ సన్, MLA ముఠా గోపాల్, కార్పొరేషన్ చైర్మన్ లు గజ్జెల నగేష్, కోలేటి దామోదర్ గుప్తా, అనిల్ కుమార్ కూర్మాచలం, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి, నగర గ్రంధాయల సంస్థ చైర్మన్ ప్రసన్న, కార్పొరేటర్ లు హేమలత, టి.మహేశ్వరి, మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, మాజీ కార్పొరేటర్ లు నామన శేషుకుమారి, తరుణి, సేనియర్ నాయకులు క్యామ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

KTR జన్మదిన వేడుకలలో భాగంగా ప్రపంచ రికార్డ్ సాధించిన రూబిక్స్ క్యూబ్ ఆర్టిస్ట్ ఇర్ఫాన్ కుట్టి కండ్లకు గంతలు కట్టుకొని రూబిక్ క్యూబ్స్ తో రూపొందించిన KTR చిత్రం, HAPPY BIRTH DAY KTR ANNA విషెస్ ఆహ్వానితులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ఇర్ఫాన్ కుట్టి ని సత్కరించి అభినందించారు. అదేవిధంగా గిఫ్ట్ ఏ స్మైల్ క్రింద ఒకొక్కరికి 10 లక్షల రూపాయల రిస్క్ కవరేజ్ తో వివిధ ఛానళ్లకు చెందిన వెయ్యి మంది వీడియో జర్నలిస్ట్ లకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్ లను మంత్రుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్బంగా థ్రిల్ సిటీ థీమ్ పార్క్ లో గల వరల్డ్ బిగ్గెస్ట్ త్రీడీ స్క్రీన్ లో మంత్రి KTR కు విశేస్ తెలియజేస్తూ రూపొందించిన వీడియో ను వీక్షించారు. అదేవిధంగా KTR పనితీరు, వ్యక్తిత్వం, సాధించిన విజయాలను వివరిస్తూ రూపొందించిన ప్రత్యేక సాంగ్ ను ప్రదర్శించారు.

అనంతరం ప్రత్యేకంగా తయారు చేయించిన భారీ కేక్ ను ముఖ్య అతిధిగా హాజరైన హోంమంత్రి మంత్రి మహమూద్ అలీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సాయి కిరణ్ యాదవ్ లతో కలిసి కట్ చేశారు. ఈ సందర్బంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ KTR గొప్ప నాయకుడు అని అన్నారు. రాష్ట్రంలో నూతనంగా పరిశ్రమల ఏర్పాటు, IT రంగం అభివృద్ధి కి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ఎంతో మంది యువతకు KTR స్పూర్తిగా మారారని అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్