Sunday, November 24, 2024
HomeTrending NewsYSRCP: ఎవరు మేలు చేశారో ఆలోచించాలి: పుష్ప శ్రీవాణి

YSRCP: ఎవరు మేలు చేశారో ఆలోచించాలి: పుష్ప శ్రీవాణి

14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు చేయలేని సామాజిక సాధికారతను నాలుగున్నరేళ్లలోనే సిఎం జగన్ చేసి చూపించారని మాజీ డిప్యూటీ సిఎం పాముల పుష్పశ్రీ వాణి అన్నారు. రాష్ట్రానికి చిట్టచివరన ఉన్న కురుపాం నియోజకవర్గానికి చెందిన, గిరిజన వర్గానికి చెందిన తనను రాష్ట్రానికి తొలి మహిళా ఉపముఖ్యమంత్రిని చేసి తన ఆలోచనలు ఏంటో జగన్ చాటి చెప్పారని వెల్లడించారు. ఎస్టీ, ఎస్సీ, బీసీలు అత్యధికంగా ఉన్న ఈ ప్రాంతంలో చంద్రబాు హయాంలో కనీస అభివృద్ధికి నోచుకోలేదని, జగన్ సీఎం కాక ముందు ఇక్కడ పరిస్థితి ఏంటి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ స్థాయిలో ప్రాంతాలు అభివృద్ధి చెందాయన్నది ప్రజలే గమనించాలని పిలుపునిచ్చారు. గిరిజన సీమలో వైఎస్సార్ సీపీ సామాజిక సాధికార బస్సు యాత్రకు అపూర్వ ఆదరణ లభించింది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం పట్టణ నడిబొడ్డున జరిగిన బహిరంగసభకు ఉప ముఖ్యమంత్రులు పీడిక రాజన్నదొర, బూడి ముత్యాల నాయుడు, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో అర్డినేటర్ వై వీ సుబ్బారెడ్డి, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, అరకు ఎంపీ గొట్టేట మాధవి, ఎమ్మెల్యేలు అలజంగి జోగారావు, కళావతి, శంబంగి చిన అప్పల నాయుడు హాజరయ్యారు.

ఈ సభలో శ్రీవాణి మాట్లాడుతూ…. జేఎన్టీయూ ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీని స్థాపించిన ఘనత జగన్ దేనని, త్వరలో ప్రభుత్వ మహిళా కాలేజీకి కూడా శంఖుస్థాపన చేస్తారని వెల్లడించారు. గిరిజనులకు జగన్ ఎక్కువ మేలు చేసారా, బాబు చేసాడా అన్నది ప్రజలందరికీ తెలుసునన్నారు. హామీలిచ్చి మోసం చేసిన మోసగాడు చంద్రబాబు అయితే, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన మొనగాడు జగన్ అని కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఈ తూర్పు కనుమల్లో వైసీపీ జెండా జయకేతనం ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

మచిలీపట్నంలో 

ఇంతకాలంగా దేనికీ నోచుకోని కుటుంబాలు మన ప్రభుత్వంలో హాయిగా జీవించేలా భవిష్యత్‌పై ఆశలు కల్పించిన ఘనత సీఎం జగన్‌ కే దక్కుతుందని రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.  అన్ని వర్గాలకూ అధికారం కట్టబెట్టడం జగన్ పాలనలోనే మొదలైందని అన్నారు. జై జగన్‌ నినాదాలతో బందరు మార్మోగింది. మచిలీపట్నంలో సామాజిక సాధికారత వెల్లివిరిసింది. బస్సు యాత్రతో బందరు రోడ్లన్నీ కిక్కిరిశాయి.  ఈ కార్యక్రమంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యేలు పేర్ని నాని, కైలే అనిల్‌కుమార్, అనిల్‌ కుమార్‌ యాదవ్, హఫీజ్‌ ఖాన్, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, పోతుల సునీత, జెడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక తదితరులు పాల్గొన్నారు.

ధర్మాన మాట్లాడిన ముఖ్యాంశాలు:

  • గత ప్రభుత్వంలో ముస్లింలకు, గిరిజనులకు మంత్రి పదవులు ఇవ్వలేదు. వాళ్లు మనుషులు కాదా?
  • కుటుంబ గౌరవాన్ని కాపాడే బాధ్యత ఇంటి ఇల్లాలిదే అని భావించిన సీఎం జగన్‌. అన్ని సంక్షేమ కార్యక్రమాలకూ ఇంటి ఇల్లాలినే యజమానిగా చేశారు.
  • పేదల ఆకలి తీర్చి, కన్నీరు తుడిస్తే చంద్రబాబు ఈ డబ్బంతా వృథా అంటున్నాడు.
  • వీరిని ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు సీఎం జగన్‌ మనకు దొరికాడు. ఎవరిని ఆదరిస్తాం? ఆలోచించాలి.
  • ప్రతిసారీ అబద్ధం ఆడి బీదలకు సాయమే తప్పు అన్న వ్యక్తిని మళ్లీ అధికారంలోకి తీసుకొస్తామా?
  • రూ.12,800 కోట్లు బడ్జెట్‌లో పెట్టి ప్రయివేటు రైతుల దగ్గర కొని 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు సమకూర్చాం. ఇప్పుడు ఊళ్లకు ఊళ్లు నిర్మాణం జరుగుతున్నాయి.
  • చంద్రబాబు పాలనలో పట్టుమని 5 లక్షల ఇళ్లకు ఏనాడైనా భూమి కొన్నాడా?

  • తల్లికి అమ్మ ఒడి ద్వారా రూ.15 వేలు ఇచ్చాడు. పది సంవత్సరాల పిల్లాడు ఓటేస్తాడని జగన్‌ ఇవన్నీ చేశాడా?
  • పిల్లాడు పెరిగి పెద్ద అయ్యి చదివి ఉన్నత స్థాయికి చేరితే ఆ కుటుంబం స్థాయి పెరుగుతుందని సీఎం జగన్‌ ఇదంతా చేస్తున్నారు.
  • రూ.2.40 లక్షల కోట్లు మీ ఖాతాల్లో వేసిన సీఎం జగన్‌. ఎక్కడా ఒక్కరూపాయి లంచం ఇచ్చామనే కంప్లయింట్‌ రాలేదు.
  • ఈ డబ్బంతా వేస్టని చంద్రబాబు అంటాడు. మళ్లీ తనకు ఓటేయమంటాడు.
  • గతంలో ఊరికి ఐదు మంది చొప్పున లంచం తీసుకొనేవాళ్లను పెట్టారు.
  • ఇప్పుడు కులం, మతం, వర్గం అడగలేదు. ఆకలి తీర్చాల్సిన, కన్నీరు తుడవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని సీఎం జగన్‌ చెప్పారు.
  • ఏ గ్రామంలోనూ వైయస్సార్‌సీపీకి వ్యతిరేకత లేదు. దీంతో నూనె, కరెంటు, గ్యాస్, పెట్రోలు, డీజిలు, కిరోసిన్‌ ధరలు పెరిగాయని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.
  • ఈ ధరలు దేశమంతా ఒకేలా ఉన్నాయి. ఒకేలా పెరిగాయి. పెంచింది కేంద్రం.
  • ఇతర విషయాల్లో ఈ ప్రభుత్వాన్ని విమర్శించలేరు కాబట్టి టీడీపీ నేతలు ఇలా ఆరోపణలు చేస్తున్నారు.
RELATED ARTICLES

Most Popular

న్యూస్