Wednesday, February 26, 2025
Homeసినిమా'రాయన్' పై అంచనాలు పెంచుతున్న ధనుశ్!

‘రాయన్’ పై అంచనాలు పెంచుతున్న ధనుశ్!

కోలీవుడ్ లో ఒకప్పుడు ప్రయోగాత్మక చిత్రాలను చేయడంలో కమల్ పేరు ఎక్కువగా వినిపించేది. ఆ తరువాత విక్రమ్ .. సూర్య కూడా అదే దారిలో వెళ్లడానికి ఆసక్తిని చూపుతూ వచ్చారు. ఆ తరువాత ధనుశ్ కూడా అదే పద్ధతిలో కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు దర్శకత్వం వహించడం .. తన అభిరుచికి తగిన సినిమాలను నిర్మించడం .. సందర్భం కుదిరితే పాటలు రాయడం .. పాడటం  ధనుశ్ కి అలవాటే. ఇలా ఏదో ఒక వైపు నుంచి కొత్తదనం కోసం తపన పడుతూనే ఉంటాడు.

అలాంటి ధనుశ్ నుంచి ఆయన 50వ సినిమాగా ‘రాయన్’ రూపొందుతోంది. సంఖ్యా పరంగా ఈ సినిమా ప్రత్యేకతను సంతరించుకున్న కారణంగా, ఈ సినిమాకి ధనుశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి కథ .. స్క్రీన్ ప్లే అందించింది కూడా ఆయనే. ప్రస్తుతం ఈ సినిమా చకచకా షూటింగు జరుపుకుంటోంది. ఫస్టు లుక్ తోనే అంతా ఈ సినిమాను గురించి మాట్లాడుకునేలా ధనుశ్ చేయగలిగాడు. యాక్షన్ థ్రిల్లర్ గా ఆయన ఈ సినిమాను తెరపైకి తీసుకురానున్నాడు.

సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎస్.జె. సూర్య ..  సందీప్ కిషన్ .. సెల్వ రాఘవన్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ధనుశ్ సోదరుడే సెల్వ రాఘవన్ అనే విషయం తెలిసిందే. తాను కూడా మంచి దర్శకుడే. రీసెంటుగా ఆయన ఈ సినిమా షూటింగులో జాయిన్ అయ్యాడు. ‘మిమల్ని డైరెక్ట్ చేస్తానని అనుకోలేదు సార్’ అంటూ ధనుశ్ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాను, పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్