భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెంలో గురువారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా వర్షం పడుతోంది. భద్రాచలం, బూర్గంపాడు, దుమ్ముగూడెం మండలాల్లో వర్షం జోరుగా పడుతోంది. ప్రధాన రహదారులతో సహా రోడ్లన్నీ జలమయమయ్యాయి. వర్షం కారణంగా సింగరేణి జీకేఓసీలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఎగువన భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నదిలో ఒక్కసారిగా ప్రవాహం పెరిగింది. ఒక్కరోజులోనే నదిలో నీటిమట్టం 13 అడుగులకు చేరింది.
Kothagudem: కొత్తగూడెంలో జోరుగా వర్షం
భద్రాద్రి రామయ్య సన్నిధి కల్యాణమండపం వద్ద పెను ప్రమాదం తప్పింది. కల్యాణమండపం వద్ద రోడ్డు మీద నుంచి రేలింగ్ పైకి కారు దూసుకెళ్లింది. అయితే ఆ సమయంలో అక్కడ భక్తులు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.