Friday, March 29, 2024
HomeTrending Newsఉత్తర కశ్మీర్ ను కప్పేసిన మంచు

ఉత్తర కశ్మీర్ ను కప్పేసిన మంచు

జమ్మూ కశ్మీర్లోని ఉత్తర ప్రాంతాల్లో ఈ ఏడాది మొదటిసారిగా మంచు వర్షం ప్రారంభం అయింది. ప్రఖ్యాత పర్యాటక కేంద్రం బారాముల్లా జిల్లా గుల్ మార్గ్ ను మంచు దుప్పటి కప్పేసింది. భూలోక స్వర్గంగా చెప్పుకునే గుల్ మార్గ్ లో స్కీయింగ్ మధురానుభూతి ఆస్వాదించేందుకు పర్యాటకులు బారులుతీరారు.

అటు పహల్గంలో కూడా స్నోఫాల్ పర్యాటకులను ఆకట్టుకుంటోంది. గుల్ మార్గ్ లో మైనస్ 1.5 డిగ్రీలు, పహల్గాంలో 0.3 డిగ్రీల సెల్సియస్ కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి.

ఉదయం నుంచి పడుతున్న మంచుతో మొఘల్ రోడ్డుపై రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. సోఫియాన్-రాజోరి-పూంచ్ జిల్లాలను కలిపే మొఘల్ రహదారి మీద అనేక చోట్ల వాహనాలు నిలిచిపోయాయి. వాహనాలు వదిలేసి పర్యాటకులు మంచులో ఎంజాయ్ చేస్తున్నారు. రోడ్డుపై గుట్టలుగా మంచు పేరుకు పోవటంతో వాహనాల రాకపోకల్ని అనుమతించటం లేదు.

ఉత్తర కశ్మీర్ లోని అనేక ప్రాంతాల్లో రెండు సెంటీమీటర్ల వరకు మంచు పేరుకుపోయింది.మంచుతో నిండిపోయిన ఇళ్ళ పైకప్పులు, వృక్షాలు శ్వేతవర్ణంలో ఆకర్షిస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్