Saturday, January 18, 2025
Homeసినిమాగ్రాండ్ గా 'గీతా'విష్కరణ - సెప్టెంబర్ 9న సినిమా విడుదల

గ్రాండ్ గా ‘గీతా’విష్కరణ – సెప్టెంబర్ 9న సినిమా విడుదల

గ్రాండ్ మూవీస్ పతాకంపై ఆర్.రాచయ్య నిర్మించిన విభిన్న కథాచిత్రం ‘గీత‘. వి.వి.వినాయక్  శిష్యుడు విశ్వ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ‘మ్యూట్ విట్నెస్’  అనేది ఈ చిత్రానికి ఉప శీర్షిక. సెన్సార్ సహా అన్ని కార్య్రమాలు పూర్తి చేసుకుని, బిజినెస్ పరంగా మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ చిత్రం సెప్టంబర్ 9న విడుదల కానుంది. ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక హైదరాబాద్ లోని దసపల్లాలో అత్యంత ఘనంగా జరిగింది.
క్రేజీ కథానాయిక హెబ్బా పటేల్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో సునీల్ ముఖ్యపాత్ర పోషించగా.. “నువ్వే కావాలి, ప్రేమించు” వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించిన సాయి కిరణ్ విలన్ గా నటించారు. సుభాష్ ఆనంద్ సంగీత సారథ్యం వహించగా సాగర్ సాహిత్యం సమకూర్చారు.

దర్శకుడు విశ్వ మాట్లాడుతూ  “ఈ సినిమా అవకాశం నా గురువు, దైవం అయిన వినాయక్ గారే ఇప్పించారు. అనివార్య కారణాల వల్ల ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. నిర్మాత రాచయ్యగారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే “గీత” విడుదలకు సహాయ సహకారాలు అందిస్తున్న పొలిశెట్టి, డివిడి విజయ్ లకు ప్రత్యేక కృతఙ్ఞతలు” అన్నారు.

నిర్మాత ఆర్.రాచయ్య మాట్లాడుతూ… “గురువుకు తగ్గ శిష్యుడు అనిపించుకునేలా మా డైరెక్టర్ విశ్వ… “గీత” చిత్రాన్ని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. సెప్టెంబర్ 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం.” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్