Monday, January 20, 2025
Homeసినిమాసురేష్‌ బాబు చేతుల మీదుగా 'HER' రిలీజ్ డేట్ పోస్టర్ రిలీజ్

సురేష్‌ బాబు చేతుల మీదుగా ‘HER’ రిలీజ్ డేట్ పోస్టర్ రిలీజ్

కెరీర్ పరంగా వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటున్న రుహానీ శర్మ ఇప్పుడు ‘HER’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు శ్రీధర్ స్వరాఘవ్ దర్శకత్వం వహించారు. డబుల్ అప్ మీడియాస్ సంస్థ ఫస్ట్ ప్రొడక్షన్ గా ఈ సినిమాను రఘు సంకురాత్రి, దీపా సంకురాత్రి నిర్మించారు. ఈ చిత్రంలో వికాస్ వశిష్ట, ప్రదీప్ రుద్ర, జీవన్ కుమార్, అభిగ్న్య, సంజయ్ స్వరూప్, బెనర్జీ, రవివర్మ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.

HER ఫైనల్ కాపీ చూసిన సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి ముందుకొచ్చారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటనను మేకర్లు ఇది వరకే ఇచ్చారు. అయితే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత డి. సురేష్‌ బాబు రిలీజ్ చేశారు. అనంతరం సినిమా టీంకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. సురేష్ ప్రొడక్షన్స్ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ ద్వారా ఈ సినిమా జూలై 21న థియేటర్లోకి రాబోతోంది. ఇప్పటికే HER పోస్టర్స్, టీజర్ సినిమా పై హైప్ పెంచేశాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్