Saturday, January 18, 2025
Homeసినిమామరోసారి మేజిక్ చేయబోతున్న హిట్ కాంబినేషన్!

మరోసారి మేజిక్ చేయబోతున్న హిట్ కాంబినేషన్!

ఒకసారి హిట్ కొట్టిన హీరో – దర్శకుడు కలిసి మరోసారి సెట్స్ పైకి వెళ్లడమనేది కామన్ గా జరుగుతూనే ఉంటుంది. ఆ కాంబినేషన్ మళ్లీ సెట్స్ పైకి వెళ్లడమనేది ఒక్కోసారి వెంటనే జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి కాస్త ఆలస్యమవుతూ ఉంటుంది. అలా ఒకసారి హిట్ కొట్టేసి .. మరోసారి హిట్ అందుకోవడానికి సెట్స్ పైకి వెళుతున్న కాంబినేషన్స్ జాబితాలో నితిన్ – విక్రమ్ కుమార్ చేరిపోతున్నారు. గతంలో ఈ ఇద్దరూ కలిసి చేసిన ‘ఇష్క్’ సినిమా యూత్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది.

2012లో వచ్చిన ఈ సినిమా నిర్మాతలకు గట్టిగానే లాభాలు తెచ్చిపెట్టింది. పరాజయాలతో ఉక్కిరిబిక్కిరవుతున్న నితిన్ ను ఈ సినిమా గట్టున పడేసింది. నితిన్ మరిన్ని సినిమాలు చేయడానికి చాలా హెల్ప్ చేసింది. మళ్లీ పుష్కర కాలం తరువాత, విక్రమ్ కుమార్ నితిన్ కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నారు. ఆల్రెడీ విక్రమ్ కుమార్ కథ వినిపించడం .. నితిన్ తన బ్యానర్ లోనే చేయడానికి అంగీకరిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందని అంటున్నారు. ప్రస్తుతం విక్రమ్ కుమార్ ఈ స్క్రిప్ట్ పైనే కసరత్తు చేస్తున్నాడని చెబుతున్నారు.

నితిన్ కెరియర్ లో హిట్లు .. ఫ్లాపులు సాధారణ విషయమవుతూనే వచ్చాయి. కొంతకాలంగా ఆయన హిట్ కోసం బలమైన ప్రయత్నాలే చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ప్రాజెక్టులు రెండు సెట్స్ పై ఉన్నాయి. ‘రాబిన్ హుడ్’ .. ‘తమ్ముడు’ సినిమాలను పూర్తిచేసే పనిలో ఆయన ఉన్నాడు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన తరువాత, విక్రమ్ కుమార్ సినిమా ఉంటుందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్