ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం సలార్. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సెప్టెంబర్ 28న సలార్ విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నారు. కేజీఎఫ్ సినిమాలో చూసిన యాక్షన్ సీన్స్ కంటే రెట్టింపు సర్ ఫ్రైజ్ చేసేలా ఉంటాయట. ప్రభాస్ ఏకంగా 400 మంది ఫైటర్స్ తో పోరాడతాడట.
సలార్ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీన్స్ గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఉంటాయట. ఈ సీన్స్ లోనే ప్రభాస్ రెండో పాత్ర గురించి ఆసక్తికర విషయాన్ని రివీల్ చేస్తారని తెలిసింది. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 చిత్రాలతో సంచలన సృష్టించిన ప్రశాంత్ నీల్ సలార్ తో మరోసారి సంచలనం సృష్టించడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తుంది. ఓ వైపు షూటింగ్ జరుగుతుండగా మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇప్పటికే సినిమా ఆలస్యమైంది. అందుచేత ఈసారి డేట్ మారకుండా సెప్టెంబర్ 28న విడుదల చేసేందుకు పక్కా ప్లాన్ చేస్తున్నారు.
జూన్ 16న ఆదిపురుష్ మూవీ విడుదలవుతుంది. అంటే మూడు నెలల గ్యాప్ లో ప్రభాస్ నుంచి మరో సినిమా సలార్ వస్తుంది అంటే అనుమానాలు వ్యక్తం చేశారు కానీ.. అనౌన్స్ చేసినట్టుగా సెప్టెంబర్ 28న సలార్ వచ్చేస్తోంది. బాహుబలి హీరో ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న సలార్ పై బాలీవుడ్ లో కూడా భారీ అంచనాలున్నాయి.