మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్.. కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం ‘ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.చరణ్ లో ఉన్న నటుణ్ణి బైటకు తీసిన ఈ మూవీలో చిట్టిబాబు క్యారెక్టర్ ని ప్రేక్షకులు ఎప్పటికీ మరచిపోలేరు. అంతలా ఆ పాత్రలో లీనమై ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. అయితే.. చరణ్, సుక్కు కలిసి మరో సినిమా చేయనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. పుష్ప 2 తర్వాత చరణ్ తో సుకుమార్ మూవీ ఉంటుందని టాక్ వినిపిస్తోంది.
ఈ కాంబినేషన్ సెట్ అవ్వాలంటే.. చరణ్ శంకర్ మూవీ, బుచ్చిబాబు మూవీ కంప్లీట్ చేయాలి. సుకుమార్ పుష్ప 2 కంప్లీట్ చేయాలి. ఇదంతా జరగడానికి టైమ్ పడుతుంది. అయితే.. నిజంగానే వీళ్లిద్దరి కాంబోలో మరో సినిమా రానుందా? లేక ఇది గాసిప్పా అనే అనుమానం రావచ్చు. అయితే… ఆ అనుమానాలకు రాజమౌళి ఫుల్ స్టాప్ పెట్టడం విశేషం. ఇంతకీ మేటర్ ఏంటంటే… బాలీవుడ్ కి చెందిన ఓ ప్రముఖ సినీ విమర్శకుడితో ఇటీవల జరిగిన సంభాషణలో రాజమౌళి ఈ విషయాన్ని రివీల్ చేశారు. తన ఆర్ఆర్ఆర్ స్టార్ రామ్ చరణ్, పుష్ప డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రానున్న ఒక చిత్రం కోసం చాలా ఎగ్జైట్ మెంట్ తో ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
ఈ సినిమా ఓపెనింగ్ సీక్వెన్స్ ను చరణ్ వివరించినప్పుడు.. నేను ఆశ్చర్యపోయాను. అప్పుడే చరణ్, సుక్కుల ఈ కాంబో పై నేను ఓ అంచనాకి వచ్చేశానని రాజమౌళి చెప్పడం విశేషం. దీంతో చరణ్ – సుకుమార్ ప్రాజెక్ట్ పక్కా అని తెలుస్తోంది. ఈ విధంగా చరణ్, సుక్కు మూవీ పై అంచనాలు పెంచేశారు జక్కన్న. అయితే.. ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి రావాలంటే.. కొంత కాలం ఆగాల్సిందే.
Also Read : చరణ్, బుచ్చిబాబు ప్రాజెక్ట్ కథ ఏమిటి?