Sunday, January 19, 2025
HomeTrending Newsసోమేశ్ కుమార్ ఏపీకి వెళ్లాల్సిందే - హైకోర్టు

సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్లాల్సిందే – హైకోర్టు

తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సొంత క్యాడర్ కు వెళ్లాల్సిందేనని హైకోర్టు తీర్పు వెలువరించింది. ఏపీ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ సోమేశ్ కుమార్.. తన సొంత రాష్ట్రానికి వెళ్లాలని ఆదేశించింది. అయితే, ఈ తీర్పు అమలును 3 వారాల పాటు కోర్టు నిలిపివేసింది. సోమేశ్ కుమార్ లాయర్ విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల విభజనను కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిచేసింది. ఏపీ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ సోమేశ్ కుమార్ ను సొంత రాష్ట్రానికి కేటాయించింది. దీనిపై సోమేశ్ కుమార్ కేంద్ర అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. తెలంగాణ రాష్ట్రానికి సోమేశ్ కుమార్ సేవలు అవసరమని భావిస్తే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుమతితో డిప్యూటేషన్ పై కొనసాగవచ్చని ట్రైబ్యునల్ సూచించింది.

అయితే, ఈ నిర్ణయంపై డీవోపీటీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ట్రైబ్యునల్ తీర్పును కొట్టేస్తూ సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్లాల్సిందేనని తాజాగా తీర్పు వెలువరించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్