హిందూ మతస్తులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ.. అమెరికాలోని జార్జియా రాష్ట్రం తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. హిందూ ఫోబియాను ఖండిస్తూ శాసనపద్ధతిలో అమెరికాలో ఓ రాష్ట్రం నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. ప్రపంచంలోని అతిపెద్ద మతాల్లో హిందూ మతం ఒకటని, చాలా పురాతనమైన మతమని, ఆ మతాన్ని అనుసరించేవాళ్లు సుమారు వంద కోట్లకు పైగా ఉంటారని, భిన్నమైన సంస్కృతులు, నమ్మకాలతో హిందువులు జీవిస్తారని ఆ తీర్మానంలో పేర్కొన్నారు.
ఇటీవల హిందూ అమెరికన్లపై పలు దేశాల్లో దాడులు జరుగుతున్నాయని, హిందూ ఫోబియా దాడుల్ని తీర్మానం ఖండించింది. హిందూ మతానికి చెందిన పవిత్ర గ్రంధాలు, సాంస్కృతిక విధానాలపై దాడి జరుగుతున్నట్లు తీర్మానంలో పేర్కొన్నారు.