Sunday, September 22, 2024
Homeసినిమాదిల్‌రాజు, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ‘హిట్ - ది ఫ‌స్ట్ కేస్‌’

దిల్‌రాజు, టీ సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ‘హిట్ – ది ఫ‌స్ట్ కేస్‌’

తెలుగులో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన మిస్ట‌రీ యాక్ష‌న్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ‘హిట్ – ది ఫ‌స్ట్ కేస్‌’ సినిమా బాలీవుడ్ రీమేక్ ఆదివారం పూజా కార్య‌క్ర‌మాలతో లాంఛ‌నంగా ప్రారంభమైంది. తెలుగులో ‘హిట్‌’ సినిమాను డైరెక్ట్ చేసిన శైలేష్ కొల‌ను హిందీలోనూ డైరెక్ట్ చేస్తున్నారు. రాజ్‌కుమార్ రావ్‌, సాన్యా మ‌ల్హోత్రా హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ కార్య‌క్రమంలో హీరో రాజ్ కుమార్ రావ్‌, నిర్మాతలు దిల్‌రాజు, భూష‌ణ్ కుమార్‌, కుల్దీప్ రాథోర్‌తో పాటు ద‌ర్శ‌కుడు డా.శైలేష్ కొల‌ను పాల్గొన్నారు. న‌గరంలో క‌నిపించ‌కుండా పోయిన అమ్మాయిల‌ను వెతికే పోలీస్ టీమ్ హోమిసైడ్ ఇంట‌ర్వెన్‌ష‌న్ టీమ్‌లో ఆఫీస‌ర్ కేసును ఎలా సాల్వ్ చేశాడ‌నేదే ఈ సినిమా క‌థాంశం.

మిస్ట‌రీ, స‌స్పెన్స్ అంశాల ఆక‌ట్టుకునే సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్ ఇది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని చిత్ర యూనిట్ స‌భ్యులు తెలియ‌జేశారు. రాజ్ కుమార్ రావ్ , సాన్యా మ‌ల్హోత్ర త‌దిత‌రులు నటించిన ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ‌లు: టి సిరీస్‌, దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్, నిర్మాత‌లు: దిల్‌రాజు, భూష‌ణ్ కుమార్‌, కుల్దీప్ రాథోర్‌, ద‌ర్శ‌క‌త్వం: డా.శైలేష్ కొల‌ను

RELATED ARTICLES

Most Popular

న్యూస్