ఇండియా-ఆస్ట్రేలియా మధ్య అడిలైడ్ మాటే స్టేడియంలో జరుగుతోన్న ఐదు మ్యాచ్ ల హాకీ సిరీస్ ను ఆతిథ్య ఆస్ట్రేలియా 4-1 తేడాతో గెల్చుకుంది. నేడు జరిగిన చివరి మ్యాచ్ లో 5-4 తో విజయం సాధించింది. ఐదు టెస్టుల్లో మూడో దానిలో మాత్రమే ఇండియా 4-3 గోల్స్ తేడాతో విజయం దక్కించుకోగలిగింది. నిన్న జరిగిన నాలుగో మ్యాచ్ లో5-1తో గెలుపొంది ఇప్పటికే సిరీస్ ను ఆసీస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. నేటి మ్యాచ్ లో గెలిచి కనీసం ఆధిక్యాన్ని తగ్గించాలన్నమన్ ప్రీత్ సేన ఆశలు ఫలించలేదు.
నేడు… ఆట మొదటి నిమిషంలోనే ఆసీస్ ఆటగాడు టామ్ విక్ హామ్ తొలి గోల్ చేసి బోణీ కొట్టాడు. రెండో పావు భాగంలో మరో గోల్ సాధించి ఆసీస్ ను 2-0 ఆధిక్యానికి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత 29, 39, 53 నిమిషాల్లో మరో మూడు గోల్స్ ఆతిథ్య జట్టు సంపాదించింది. ఈ ఐదూ ఫీల్డ్ గోల్స్ కావడం గమనార్హం.
ఇండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ 23వ నిమిషంలో తొలి గోల్ అందించాడు. 33, 54, 59 నిమిషాల్లో మరో మూడు గోల్స్ ఇండియా చేయగలిగింది. వీటిలో రెండు పెనాల్టీ కార్నర్స్, రెండు ఫీల్డ్ గోల్స్ ఉన్నాయి.
2023 జనవరి 13 నుంచి ఓడిషాలో జరగనున్న హాకీ ప్రపంచ కప్ జరగనుంది.