Sunday, January 19, 2025
Homeసినిమాకోవిడ్ సంక్షోభంలో ‘సలార్’ నిర్మాత సాయం

కోవిడ్ సంక్షోభంలో ‘సలార్’ నిర్మాత సాయం

ప్ర‌స్తుతం కొవిడ్ 19 ప్ర‌భావంతో ప్ర‌పంచం యావ‌త్తు క్లిష్ట ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా మ‌న దేశం విష‌యానికి వ‌స్తే.. సామాన్యులు ఎన్నో ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారు. అలాగే క‌రోనా బారిన ప‌డిన వారు ఆస్పత్రుల్లో బెడ్లు అందుబాటులో లేకుండా, ఆక్సిజ‌న్ అంద‌క ఇక్క‌ట్ల‌కు గుర‌వుతున్నారు. ఈ పాండ‌మిక్ స‌మ‌యంలో సినీ రంగం కూడా క‌ష్ట న‌ష్టాల‌ను భ‌రిస్తోంది. సినిమా షూటింగ్స్‌, రిలీజ్‌లు ఆగిపోయాయి. ముఖ్యంగా సినీ కార్మికులు చాలా స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. ఇది సినీ పరిశ్రమకు ప‌రీక్షా స‌మ‌యమని, ఇలాంటి స‌మ‌యంలో మ‌నం అందరం ఒక‌రికొక‌రు అండ‌గా నిల‌బ‌డాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉందనే ఆలోచ‌న‌తో సినీ కార్మికుల‌కు అండ‌గా నిల‌బ‌డ‌టానికి ముంద‌డుగు వేసింది ఇండియాలోని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ల్లో ఒక‌టైన హోంబ‌లే ఫిలింస్‌.

హోంబలే సంస్థ…రెండు కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేసి క‌ర్ణాట‌క‌లోని మాండ్య ప్రాంతంలో రెండు ఆక్సిజన్ ప్లాంట్స్‌, 20 ఆక్సిజ‌న్ బెడ్లు ఏర్పాటు చేసింది. అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలోని వివిధ శాఖ‌ల్లోని 3200 మంది స‌భ్యుల‌కు 35 ల‌క్ష‌ల రూపాయల సాయాన్ని అందించింది హోంబలే నిర్మాణ సంస్థ. అంతే కాకుండా హోంబలే నిర్మాణ సంస్థ‌లో రూపొందుతోన్న ‘స‌లార్’ సినిమా కేవలం పది రోజుల చిత్రీకరణను మాత్రమే పూర్తి చేసుకుంది. అయినప్పటికీ ఆ సినిమా కోసం పని చేస్తున్న 150 మంది యూనిట్ స‌భ్యుల కుటుంబాల‌కు ఒక్కొక్క‌రికీ రూ.5000 చొప్పున ఆర్థిక సాయాన్ని అందించారు. గత ఏడాది పాండిమిక్ స‌మ‌యంలోనూ 350 మంది సినీ కార్మికుల‌కు ఒక్కొక్క‌రికీ రూ.5000 వేల ఆర్థిక సాయాన్ని రెండు నెల‌ల పాటు అందించి బాసటగా నిలిచింది హోంబ‌లే నిర్మాణ సంస్థ.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్