Sunday, April 27, 2025
HomeTrending Newsతమిళనాడులో హుక్కా బార్లు నిషేధం

తమిళనాడులో హుక్కా బార్లు నిషేధం

హుక్కా బార్లను నిషేధిస్తూ తమిళనాడు అసెంబ్లీ ఈ రోజు బిల్లును ఆమోదించింది. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశ పెట్టగా.. ఏకగ్రీవంగా ఆమోదించారు. చెన్నై నగరంలో హుక్కా బార్ లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయని, అనేక రెస్టారెంట్లు ఈ సర్వీసెస్ ను అందుబాటులో ఉంచుతున్నాయని మంత్రి చెప్పుకొచ్చారు. స్మోకింగ్ జోన్స్, హుక్కా అనుమతి ప్రాంతాలను ఏర్పాటు చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పొగాకు దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా హుక్కా బార్ ను నిషేధిస్తూ సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టానికి సవరణలు చేస్తూ తమిళనాడు అసెంబ్లీ బిల్లును ఆమోదించింది. హుక్కా బార్ నుండి మెటీరియల్స్ ను స్వాధీనం చేసుకునేందుకు సబ్-ఇన్‌స్పెక్టర్, అంతకంటే పై పోలీసు అధికారికి అధికారం కల్పించే క్లాజును జోడించాలని కూడా బిల్లు కోరింది. ఉల్లంఘించిన వారికి మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ. 50,000 వరకు జరిమానా విధించే మరో నిబంధనను ప్రవేశపెట్టింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్