గత ప్రభుత్వ హయంలో డేటా చౌర్యం జరిగిందని ఈ అంశంపై విచారణ చేస్తోన్న హౌస్ కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. తమ కమిటీ మధ్యంతర నివేదికను ఈరోజు స్పీకర్ సమక్షంలో సభకు అందజేశారు. గత ప్రభుత్వం కేవలం డేటా సెంటర్ లో ఉండాల్సిన ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని తమ పార్టీ ప్రయోజనాలకోసం ఓ ప్రైవేట్ కంపెనీకి ఇచ్చిందని చెప్పారు. ఈ సమాచారాన్ని సేవా మిత్ర యాప్ ఉపయోగించి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయని వారిని… దాదాపు 30లక్షలకు పైగా ఓట్లను జాబితా నుంచి తొలగించే ప్రయత్నం చేసిందని వివరించారు.
డేటా చౌర్యం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయ్యిందని, చోరీ చేసిన వారిని పట్టుకోవాల్సిన అవసరం ఉందని భూమన సభకు చెప్పారు. మధ్యంతర నివేదిక ఆధారంగా ఈ అంశంపై మరింత లోతైన విచారణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
Also Read: డిప్యూటీ స్పీకర్ గా కోలగట్ల ఎన్నిక